నకిలీ ట్రేడింగ్ యాప్‌తో.. ఐటీ ఉద్యోగికి రూ.55 లక్షల టోకరా!
ABN , Publish Date - Nov 07 , 2026 | 06:08 AM
నకిలీ ట్రేడింగ్ యాప్ ద్వారా ఐటీ ఉద్యోగిని సైబర్ మోసగాళ్లు రూ.55 లక్షలకు పైగా మోసం చేశారు.
హైదరాబాద్ సిటీ, నవంబరు 6 (ఆంధ్రజ్యోతి) : నకిలీ ట్రేడింగ్ యాప్ ద్వారా ఐటీ ఉద్యోగిని సైబర్ మోసగాళ్లు రూ.55 లక్షలకు పైగా మోసం చేశారు. బాచుపల్లికి చెందిన బాధితుడిని సెప్టెంబరులో ‘అనన్య దాస్’ అనే మహిళ ఒక వాట్సాప్ గ్రూపులో చేర్చి అప్‌స్టాక్స్ ఇన్‌స్టిట్యూషనల్ ట్రేడింగ్‌తో అధిక లాభాలు వస్తాయని నమ్మించింది. ప్రొఫెసర్ రవికుమార్ సూచనలతో అని బ్లాక్ ట్రేడింగ్, ఐపీవోల్లో పెట్టుబడులు పెట్టించింది. upsktvpro.com అనే నకిలీ ప్లాట్‌ఫామ్‌లో ఖాతా తెరిపించి విడతల వారీగా డబ్బులు జమ చేయించింది.
మొత్తం రూ.55,58,910 పెట్టుబడి పెట్టగా ప్రారంభంలో రూ.58,700 మాత్రమే తిరిగి చెల్లించారు. యాప్‌లో రూ.97 లక్షల లాభం వచ్చినట్లు చూపించి బాధితుడిని మరిన్ని పెట్టుబడులకు ప్రోత్సహించారు. ఏసీఎంఈ, హెచ్‌డీ ఫైర్ ప్రొటెక్ట్ ఐపీవోల పేరుతోనూ భారీగా డబ్బులు పెట్టించారు. చివరకు రూ.10 లక్షలు విత్‌డ్రా చేసుకునేందుకు ప్రయత్నించగా 15 శాతం కమీషన్, 20 శాతం పన్ను ముందుగా చెల్లించాలని డిమాండ్ చేశారు. దీంతో అనుమానం వచ్చిన బాధితుడు మోసపోయినట్లు గుర్తించి సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
గ్లోబల్ సమ్మిట్‌కు పటిష్ఠ భద్రత ఏర్పాట్లు చేయాలి: సీఎం రేవంత్‌రెడ్డి
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆ పథకాల ప్రారంభానికి ముహూర్తం ఫిక్స్
తెలంగాణ ప్రభుత్వానికి కేంద్రమంత్రి ప్రశంసలు.. మంత్రి సీతక్కకు శివరాజ్ సింగ్ చౌహాన్ లేఖ
Read Latest Telangana News And AP News And National News
And Telugu News