హెచ్‌సీఏ ఉద్యోగుల నిరసన... ఎందుకంటే..
ABN , Publish Date - Mar 05 , 2026 | 09:09 AM
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఉద్యోగుల నిరసన వ్యక్తం చేశారు. ఈరోజు(గురువారం) నుంచి నిరవధిక సమ్మెకు దిగుతున్నట్లు హెచ్‌సీఏ సిబ్బంది, ఉద్యోగుల ట్రేడ్ యూనియన్ సిబ్బంది తెలిపారు.
హైదరాబాద్, మార్చి 5 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) ఉద్యోగులు నిరసన వ్యక్తం చేశారు. ఈరోజు(గురువారం) నుంచి నిరవధిక సమ్మెకు దిగుతున్నట్లు హెచ్‌సీఏ సిబ్బంది, ఉద్యోగుల ట్రేడ్ యూనియన్ (HCASE) సిబ్బంది తెలిపారు. పెండింగ్‌లో ఉన్న ఓవర్‌టైమ్ (OT) బకాయిలు, గ్రౌండ్ సిబ్బంది కన్వేయన్స్ అలవెన్సులు చెల్లించాలని డిమాండ్ చేశారు. హెచ్ ఆర్ కన్సల్టెన్సీ నియామక ప్రతిపాదనను వెంటనే రద్దు చేయాలని ఉద్యోగులు కోరారు. గతంలో మూడు నెలల పాటు జీతాలు లేకపోయినా అంకితభావంతో పనిచేశామని సిబ్బంది చెబుతున్నారు.
మెడికల్ రీయింబర్స్‌మెంట్లతో పాటు ఉద్యోగులందరికీ క్యాష్‌లెస్ ఆరోగ్య బీమా కల్పించాలని డిమాండ్ చేశారు. తమ సమస్యల పరిష్కారానికి గతంలో మేనేజ్‌మెంట్‌కు ఎన్ని లేఖలు రాసినా స్పందన లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమ డిమాండ్లు నెరవేరే వరకు ఉప్పల్ స్టేడియంలో పనులు నిలిపివేస్తామని యూనియన్ హెచ్చరించింది. ఈ సమ్మె కారణంగా మ్యాచ్‌ల నిర్వహణకు అంతరాయం కలిగితే దానికి మేనేజ్‌మెంటే బాధ్యత వహించాలని స్పష్టం చేశారు. అప్పులు చేసి కుటుంబాలను పోషించుకుంటున్నామని.. ఇక ఓపిక నశించిందని హెచ్‌సీఏ సిబ్బంది తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఫ్యాక్షన్ రాజకీయాలకు అడ్డుకట్ట వేయాలన్నదే మా లక్ష్యం: మంత్రి నారా లోకేశ్
శాసనమండలిలో గందరగోళం.. శ్రీవారి లడ్డూ అంశంపై వాగ్వాదం
Read Latest Telangana News And AP News And Telugu News