Share News

క్యూర్‌ పరిధిలో 8 క్లౌడ్‌ కిచెన్ల లైసెన్స్‌లు రద్దు

ABN , Publish Date - Nov 12 , 2026 | 06:27 AM

హైదరాబాద్‌లోని క్లౌడ్‌ కిచెన్లలో అపరిశుభ్రత, ఆహార భద్రతా నిబంధనల ఉల్లంఘనలపై టీజీసేఫ్‌ అధికారులు కొరడా ఝలిపించారు.

క్యూర్‌ పరిధిలో 8 క్లౌడ్‌ కిచెన్ల లైసెన్స్‌లు రద్దు
Hyderabad Food Safety Inspections

హైదరాబాద్‌ సిటీ, నవంబరు 11 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌లోని క్లౌడ్‌ కిచెన్లలో అపరిశుభ్రత, ఆహార భద్రతా నిబంధనల ఉల్లంఘనలపై టీజీసేఫ్‌ అధికారులు కొరడా ఝలిపించారు. క్యూర్‌ పరిధిలోని పలు క్లౌడ్‌ కిచెన్లపై ఏకకాలంలో తనిఖీలు నిర్వహించి, నిబంధనలు పాటించని ఎనిమిది కిచెన్ల లైసెన్సులను రద్దు చేశారు. ఇందులో గచ్చిబౌలిలోని స్కైగేట్‌ హాస్పిటాలిటీ, ఐటీసీ లిమిటెడ్‌, కొండాపూర్‌లోని సొడెక్సో ఇండియా, మాదాపూర్‌లోని సత్తి హాస్పిటాలిటీ ప్రైవేట్‌ లిమిటెడ్‌, సోమాజిగూడలోని లక్కీ మల్టీకుసిన్‌ రెస్టారెంట్‌, మాదాపూర్‌లోని ముమ్‌ యమ్‌ ఇన్నోవిజన్స్‌, ఖైరతాబాద్‌లోని జోరా 11బై2, అయ్యప్పసొసైటీలోని ఎల్‌ఓ ఫ్రెష్‌ ఫుడ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఉన్నాయి.


మరో 10 క్లౌడ్‌ కిచెన్లకు నోటీసులు, ఐదింటికి మెరుగుదల నోటీసులు జారీ చేశారు. తనిఖీల్లో పాడైన బియ్యం, పురుగులు పట్టిన పిండి, గడువు ముగిసిన ఆహారపదార్థాలు గుర్తించారు. వంటగదుల్లో బొద్దింకలు, ఎలకల విసర్జితాలు, తుప్పు పట్టిన యంత్రాలు కనిపించాయి. ఈ తనిఖీల్లో మొత్తం 25 ఆహార నమూనాలను సేకరించి, వినియోగానికి పనికిరాని 700 కేజీల ఆహార పదార్థాలను ధ్వంసం చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి.

ఇంటర్‌కు ఇక సెలవు!

₹40 వేల కోట్లకు టోకెన్లు

ఆరోపణలపై నిష్పాక్షిక విచారణ జరిపించాలి

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Nov 12 , 2026 | 06:27 AM