హైదరాబాద్ సెంట్రల్ జైలులో ‘జెండర్-న్యూట్రల్ సెల్’
ABN , Publish Date - Nov 06 , 2026 | 06:04 AM
దేశంలోని కారాగారాల్లో విభిన్న జెండర్ గుర్తింపులు, వ్యక్తీకరణలు కలిగిన వ్యక్తుల (ఎల్‌జీబీటీక్యూ + ట్రాన్స్‌జెండర్లు) హక్కులు, రక్షణ కోసం జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్‌హెచ్‌ఆర్‌సీ) చేసిన కృషి ఫలించింది.
న్యూఢిల్లీ, నవంబరు 5 (ఆంధ్రజ్యోతి) : దేశంలోని కారాగారాల్లో విభిన్న జెండర్ గుర్తింపులు, వ్యక్తీకరణలు కలిగిన వ్యక్తుల (ఎల్‌జీబీటీక్యూ + ట్రాన్స్‌జెండర్లు) హక్కులు, రక్షణ కోసం జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్‌హెచ్‌ఆర్‌సీ) చేసిన కృషి ఫలించింది. హైదరాబాద్ సెంట్రల్ జైలులో ప్రత్యేకంగా ‘జెండర్-న్యూట్రల్ సెల్’ ఏర్పాటైంది. ఈ మేరకు ఎన్‌హెచ్‌ఆర్‌సీకి హైదరాబాద్ సెంట్రల్ జైలు అధికారుల నివేదిక సమర్పించారు.
కాగా విభిన్న జెండర్ గుర్తింపులు కలిగిన ఖైదీల ఆత్మగౌరవాన్ని కాపాడటంతోపాటు, వారికి తగిన వసతి ఏర్పాట్లు కల్పించే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకోవడం హర్షణీయమని ఎన్‌హెచ్‌ఆర్‌సీ గురువారం ఒక ప్రకటనలో పేర్కొంది. సంస్కరణాలయాల్లో విభిన్న జెండర్ గుర్తింపులు ఉన్న వ్యక్తుల మానవ హక్కులను, వారి ప్రాథమిక గౌరవాన్ని పరిరక్షించే దిశగా చేపడుతున్న చర్యలకు ఈ పరిణామం అద్దం పడుతోందని ఎన్‌హెచ్‌ఆర్‌సీ వెల్లడించింది.
ఈ వార్తలు కూడా చదవండి..
కొడంగల్‌లో రేపటి నుంచి సీఎం పర్యటన
Read Latest AP News And Telangana News And National News
And Telugu News