Share News

వద్దన్నా నైట్‌ డ్యూటీకి వెళ్లిందని.. సహజీవనం చేస్తున్న మహిళ కొడుకును చంపిన ప్రియుడు

ABN , Publish Date - Nov 03 , 2026 | 06:05 AM

తనతో సహజీవనం చేస్తున్న మహిళ తన మాట వినకుండా నైట్‌ డ్యూటీకి వెళ్లిందనే కోపంతో ఆమె ప్రియుడు.. గదిలో నిద్రపోతున్న ఆమె కొడుకును గొంతు నులిమి దారుణంగా హత్యచేశాడు.

వద్దన్నా నైట్‌ డ్యూటీకి వెళ్లిందని.. సహజీవనం చేస్తున్న మహిళ కొడుకును చంపిన ప్రియుడు
Borabanda Murder

  • హైదరాబాద్‌లోని బోరబండలో దారుణం

బోరబండ, నవంబర్‌ 2 (ఆంధ్రజ్యోతి): తనతో సహజీవనం చేస్తున్న మహిళ తన మాట వినకుండా నైట్‌ డ్యూటీకి వెళ్లిందనే కోపంతో ఆమె ప్రియుడు.. గదిలో నిద్రపోతున్న ఆమె కొడుకును గొంతు నులిమి దారుణంగా హత్యచేశాడు. ఈ ఘటన హైదరాబాద్‌లోని బోరబండలో చోటుచేసుకుంది. హైదరాబాద్‌కు చెందిన దుర్గకు ఆరేళ్ల క్రితం పవార్‌ మధు అనే వ్యక్తితో వివాహం జరిగింది. వారికి కుమారుడు విజయ్‌ (5) ఉన్నాడు. కొడుకు పుట్టిన ఏడాదికే మధు మరణించాడు. ఈ క్రమంలో దుర్గకు నగరంలో నిజామాబాద్‌కు చెందిన విద్యాసాగర్‌తో ఏడాదిన్నర క్రితం పరిచయం ఏర్పడింది. కొంతకాలంగా ఇద్దరు సహజీవనం చేస్తున్నారు.


హఫీజ్‌పేట్‌లోని ఓ హాస్పిటాలిటీ సర్వీసెస్‌ సంస్థలో నైట్‌డ్యూటీ చేస్తున్న దుర్గ.. మూడు నెలలుగా బోరబండ ఆజంనగర్‌లోని ఓ అద్డె ఇంట్లో ప్రియుడు విద్యాసాగర్‌, కొడుకు విజయ్‌తో కలిసి ఉంటోంది. ఆదివారం రాత్రి.. నైట్‌ డ్యూటీకి వెళ్లొద్దని దుర్గతో విద్యాసాగర్‌ వాదించాడు. మానడం కుదరదని, ఉద్యోగం నుంచి తీసేస్తారని చెప్పి.. కొడుకును ఇంట్లో పడుకోబెట్టి పనికి వెళ్లింది. సోమవారం ఉదయం పని నుంచి ఇంటికి వచ్చేసరికి కుమారుడు విజయ్‌ విగతజీవిగా పడి ఉండడంతో దుర్గ బోరున విలపిస్తూ అరిచింది. దీంతో విద్యాసాగర్‌ పరారయ్యాడు. దుర్గ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు బోరబండ ఇన్‌స్పెక్టర్‌ రవికుమార్‌ తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఆటలు ముగిసినా వసతులు నిలవాలి

ఉత్సాహంగా బీజేపీ మహా పాదయాత్ర

లోలోతుల్లోకి భూగర్భజలాలు

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Nov 03 , 2026 | 06:05 AM