బంకుల్లో ఆటో ఎల్పీజీ కొరత లేకుండా చూడాలి: కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర
ABN , Publish Date - Apr 07 , 2026 | 07:00 PM
ఆటో ఎల్పీజీ తెప్పించి బంకుల్లో ఎక్కడా కొరత లేకుండా చూడాలని కంపెనీలకు తెలంగాణ పౌర సరఫరాల శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర స్పష్టం చేశారు. గత వారం రోజులుగా కంపెనీలు మంచి పనితీరు కనబరిచాయని తెలిపారు. మంగళవారం హైదరాబాద్‌లో ఆటో ఎల్పీజీ (Auto LPG) సరఫరా చేసే ప్రైవేట్ మార్కెటింగ్ కంపెనీలతో కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర సమీక్షా సమావేశం నిర్వహించారు.
హైదరాబాద్, ఏప్రిల్07: ఆటో ఎల్పీజీ తెప్పించి బంకుల్లో ఎక్కడా కొరత లేకుండా చూడాలని కంపెనీలకు తెలంగాణ పౌర సరఫరాల శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర స్పష్టం చేశారు. గత వారం రోజులుగా కంపెనీలు మంచి పనితీరు కనబరిచాయని తెలిపారు. మంగళవారం హైదరాబాద్‌లో ఆటో ఎల్పీజీ (Auto LPG) సరఫరా చేసే ప్రైవేట్ మార్కెటింగ్ కంపెనీలతో కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర సమీక్షా సమావేశం నిర్వహించారు. గత వారం రోజుల్లో మొత్తం 363 మెట్రిక్ టన్నుల ఆటో ఎల్పీజీని తెప్పించి సరఫరా చేశారని వివరించారు.
మూతపడిన 17 బంకులను మళ్లీ తెరిపించారని పేర్కొన్నారు. గ్యాస్ సరఫరాను పెంచి, మూతపడిన బంకులను మళ్లీ తెరిపించడంలో సూపర్ గ్యాస్ (Super Gas), గో గ్యాస్ (Go Gas), టోటల్ ఎనర్జీస్ (Total Energies), ప్రైమ్ ఫ్యూయల్ (Prime Fuel) కంపెనీలు చేసిన కృషిని ఈ సందర్భంగా కమిషనర్ అభినందనలు తెలిపారు. పని తీరు ఏ మాత్రం మెరుగు పరుచుకోని పలు కంపెనీల పట్ల ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఆటో ఎల్పీజీని అధికంగా తెప్పించి, బంకులన్నింటిలో సరఫరా చేయాలని కంపెనీలకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఆటో డ్రైవర్ల ఉపాధి దెబ్బతినకుండా ఉండాలంటే ఆటో ఎల్పీజీ సరఫరా ఆగకుండా చూడాలని ఆయిల్ కంపెనీలకు పౌరసరఫరాల శాఖ కమిషనర్ స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో ఆటో గ్యాస్ కొరత రాకుండా ఉండేందుకు చర్యలు చేపట్టామన్నారు. బంకులకు గ్యాస్ వస్తున్న లెక్కలను పౌరసరఫరాల శాఖ ప్రతి రోజు పర్యవేక్షిస్తుందని కమిషనర్ స్టీఫెన్ రవీందర్ వెల్లడించారు. ఏదైనా సమస్య ఉంటే హెల్ప్ లైన్ 1967కు ఫోన్ చేయాలని సూచించారు.
ఈ వార్తలు కూడా చదవండి...
ఫ్యాక్షన్ బెదిరింపులకు భయపడే వ్యక్తి రాధాకృష్ణ కాదు: మంత్రి లోకేశ్
ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయంపై వైసీపీ దాడిని ఖండించిన సీఎం చంద్రబాబు
Read Latest Telangana News And Telugu News