Share News

ఇంకెంత మంది ఆడబిడ్డలు బలైతే ప్రభుత్వం మేల్కొంటుంది: హరీశ్ రావు

ABN , Publish Date - Aug 31 , 2026 | 03:40 PM

తెలంగాణలో ఆడబిడ్డల భద్రత ప్రశ్నార్థకంగా మారడం సిగ్గుచేటని మాజీ మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. తుక్కుగూడలో నర్స్ హత్య ఘటనపై సోషల్ మీడియా ఎక్స్ వేదికగా మాజీ మంత్రి స్పందించారు.

ఇంకెంత మంది ఆడబిడ్డలు బలైతే ప్రభుత్వం మేల్కొంటుంది: హరీశ్ రావు
Harish Rao

హైదరాబాద్, ఆగస్టు 31: తెలంగాణలో ఆడబిడ్డల భద్రత ప్రశ్నార్థకంగా మారడం సిగ్గుచేటని మాజీ మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. తుక్కుగూడలో నర్స్ హత్య ఘటనపై సోషల్ మీడియా ఎక్స్ వేదికగా మాజీ మంత్రి స్పందించారు. కాంగ్రెస్ పాలనలో ప్రజల ఆస్తులకే కాదని.. ప్రజల ప్రాణాలకు కూడా భద్రత లేకుండా పోయిందని విమర్శించారు. గురుకులంలో చదివి, పేదరికాన్ని జయించి నర్సుగా సేవలందిస్తున్న ఆడబిడ్డ దారుణహత్యకు గురికావడం తీవ్రంగా కలచివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. హత్య అనంతరం అత్యాచారం జరిగినట్లు వస్తున్న వార్తలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయన్నారు.


కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అరాచకాలు పెరిగి, శాంతిభద్రతలు క్షీణిస్తున్నాయని, ప్రజల ప్రాణాలకు రక్షణ లేకుండా పోతోందని విమర్శించారు. హోం శాఖను కూడా నిర్వహిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి.. రాష్ట్రంలో పరిస్థితులు ఇంత దారుణంగా మారుతుంటే ఏం చేస్తున్నారని నిలదీశారు. ఇంకెంత మంది ఆడబిడ్డలు బలైతే ప్రభుత్వం మేల్కొంటుందని హరీశ్ ప్రశ్నించారు. ‘మహిళలకు భద్రత కల్పించలేని మీకు హోం శాఖ నిర్వహించే నైతిక హక్కు ఉందా? ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపి, నిందితుడికి వెంటనే శిక్ష పడేలా చేయాలి. రాష్ట్రంలో దిగజారుతున్న మహిళల భద్రతను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం తక్షణమే కఠిన చర్యలు చేపట్టాలని BRS పక్షాన డిమాండ్ చేస్తున్నాం’ అంటూ ఎక్స్‌లో హరీశ్‌రావు పోస్ట్ చేశారు.


ఇవి కూడా చదవండి...

రాజేంద్రనగర్‌లో అర్ధరాత్రి అగ్నిప్రమాదం.. ఐదు బైక్‌ల దగ్ధం

తుక్కుగూడ నర్సు హత్య కేసు.. అత్యాచారం జరిగినట్టు నిర్ధారణ

Read Latest Telangana News And Telugu News

Updated Date - Aug 31 , 2026 | 03:40 PM