తుక్కుగూడ నర్సు హత్య కేసు.. అత్యాచారం జరిగినట్టు నిర్ధారణ
ABN , Publish Date - Aug 31 , 2026 | 02:49 PM
హైదరాబాద్‌లోని తుక్కుగూడ నర్సు హత్యకు సంబంధించిన పోస్టుమార్టం నివేదిక విడుదలైంది. ఆమెపై అత్యాచారం జరిగినట్టు అందులో వెల్లడైంది.
హైదరాబాద్, ఆగస్టు 31: తుక్కుగూడ నర్సు హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. నర్స్‌పై అత్యాచారం జరిగినట్లు పోస్టుమార్టం నివేదికలో వెల్లడైంది. నిందితుడు సనావుల్లా కూడా అత్యాచారం చేసినట్టు అంగీకరించాడు. దీంతో పోలీసులు రేప్ సెక్షన్ ఆల్టర్ చేయనున్నారు. ఓ ప్రైవేటు ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తున్న యువతి ఈనెల 29న(శనివారం) అనుమానాస్పద స్థితిలో మరణించిన విషయం తెలిసిందే.
రాఖీ పండగ సందర్భంగా తోటి నర్సులందరూ స్వగ్రామాలకు వెళ్లగా.. హాస్టల్‌లో ఒంటరిగా ఉన్న యువతి హత్యకు గురైంది. దీంతో పహాడీ షరీఫ్ పోలీసులు దర్యాప్తు చేపట్టి.. ఆసుపత్రి సమీపంలోని కార్ల మెకానిక్ షాపులో పని చేస్తున్న సనా వుల్లా ఈ నేరానికి పాల్పడినట్టు గుర్తించారు. కిటికీ నుంచి నిందితుడు హాస్టల్‌లోకి ప్రవేశించినట్టు తెలుస్తోంది. అత్యాచారాన్ని నర్సు అడ్డుకోవడంతో.. సనా వుల్లా ఆమెను హత్య చేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది.
ఇవి కూడా చదవండి...
మియాపూర్‌లో విషాదం.. చదువు రావడం లేదనే మనస్తాపంతో..
రాజేంద్రనగర్‌లో అర్ధరాత్రి అగ్నిప్రమాదం.. ఐదు బైక్‌ల దగ్ధం
Read Latest Telangana News And Telugu News