Share News

పనులు పెండింగ్‌లో ఉండగానే జాతికి అంకితమంటూ డ్రామాలు.. జగన్‌పై నిమ్మల ఫైర్

ABN , Publish Date - Aug 31 , 2026 | 02:57 PM

వెలిగొండ ప్రాజెక్టు ప్రారంభోత్సవ సభలో గొడ్డలి పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ నిర్వాకాలను మంత్రి నిమ్మల రామానాయుడు కడిగిపారేశారు. వెలిగొండ పేరుతో జగన్ చేసిన మోసాన్ని సభలో ఆసాంతం వివరించారు.

పనులు పెండింగ్‌లో ఉండగానే జాతికి అంకితమంటూ డ్రామాలు.. జగన్‌పై నిమ్మల ఫైర్
Minister Nimmala Ramanaidu

మార్కాపురం, ఆగస్టు 31: వెలిగొండ ప్రాజెక్టు ప్రారంభోత్సవ సభలో గొడ్డలి పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ నిర్వాకాలను మంత్రి నిమ్మల రామానాయుడు కడిగిపారేశారు. వెలిగొండ పేరుతో జగన్ చేసిన మోసాన్ని సభలో ఆసాంతం వివరించారు. 2019-2024 మధ్య కాలంలో వెలిగొండ పేరుతో చేసిన దుర్మార్గాలను ఎండగట్టారు. టన్నెల్-2లో టన్నెల్ బోరింగ్ మిషన్ తీయడానికి కనీస ప్రయత్నం చేయకుండానే.. రూ.2 వేల కోట్లకు పైగా పనులు పెండింగ్‌లో ఉండగానే జాతికి అంకితమంటూ ఆనాడు జగన్ డ్రామాలాడారంటూ విరుచుకుపడ్డారు.


చంద్రబాబు హయాంలో ప్రాజెక్టు నిర్మాణానికి తీసుకున్న చర్యలు.. నిర్వాసితుల విషయంలో చంద్రబాబు పెద్ద మనస్సుతో వ్యవహరించారంటూ గత రెండేళ్ల కాలంలో జరిగిన పరిణామాలను మంత్రి వివరించారు. నాడు జగన్ ఇంకా పూర్తిగా తవ్వని సొరంగంలో కార్పెట్ వేసుకుని నడిచి నకిలీ జాతికి అంకితం కార్యక్రమాన్ని చేపట్టారని మండిపడ్డారు. టన్నెళ్లల్లోకి కృష్ణా జలాలను పంపి నిజమైన జాతికి అంకితం కార్యక్రమాన్ని సీఎం చంద్రబాబు చేపట్టారని మంత్రి నిమ్మల రామానాయుడు వివరించారు.


ఇవి కూడా చదవండి...

వెలిగొండ ప్రాజెక్ట్ పూర్తి చేస్తానంటూ నమ్మించి మోసం.. జగన్‌పై ఎంపీ మాగుంట సీరియస్

ఏపీ లిక్కర్ కేసు.. రాజ్ కసిరెడ్డి, వాసుదేవరెడ్డికి సుప్రీంకోర్టు నోటీసులు

Read Latest AP News And Telugu News

Updated Date - Aug 31 , 2026 | 03:06 PM