Share News

ఏపీ లిక్కర్ కేసు.. రాజ్ కసిరెడ్డి, వాసుదేవరెడ్డికి సుప్రీంకోర్టు నోటీసులు

ABN , Publish Date - Aug 31 , 2026 | 02:36 PM

ఏపీ మద్యం రవాణా కేసులో రాజ్ కసిరెడ్డి, డి.వాసుదేవరెడ్డిల అరెస్టుల వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరింది. ఇద్దరి అరెస్టులకు సంబంధించిన అంశంపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది.

ఏపీ లిక్కర్ కేసు.. రాజ్ కసిరెడ్డి, వాసుదేవరెడ్డికి సుప్రీంకోర్టు నోటీసులు
Supreme Court

ఢిల్లీ, ఆగస్టు 31: ఏపీ మద్యం రవాణా కేసులో రాజ్ కసిరెడ్డి, డి. వాసుదేవరెడ్డిల అరెస్టుల వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరింది. ఇద్దరి అరెస్టులకు సంబంధించిన అంశంపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. ఇందులో భాగంగా ఇద్దరికీ కోర్టు.. నోటీసులు జారీ చేసింది. ఈ కేసు విచారణ ప్రక్రియలో నిబంధనలను సరిగ్గా పాటించలేదన్న కారణంతో గతంలో ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం.. సుప్రీంకోర్టును ఆశ్రయించింది.


ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టిన సీజేఐ ధర్మాసనం.. రాజ్ కసిరెడ్డి, డి.వాసుదేవరెడ్డిలకు నోటీసులు జారీ చేసింది. హైకోర్టు తీర్పుపై ప్రభుత్వ అభ్యంతరాలను పరిశీలించిన ధర్మాసనం.. తదుపరి విచారణను వాయిదా వేసింది. తదుపరి విచారణలో ఈ కేసుకు సంబంధించిన అంశాలపై సుప్రీంకోర్టు మరింతగా పరిశీలించే అవకాశం ఉంది.


ఇవి కూడా చదవండి...

వెలిగొండ ప్రాజెక్ట్ ఫేజ్‌-1ను ప్రారంభించిన సీఎం చంద్రబాబు

వెలిగొండ ప్రాజెక్ట్ పూర్తి చేస్తానంటూ నమ్మించి మోసం.. జగన్‌పై ఎంపీ మాగుంట సీరియస్

Read Latest AP News And Telugu News

Updated Date - Aug 31 , 2026 | 03:27 PM