Share News

చంచల్‌గూడ జైలులో రిమాండ్ ఖైదీ ఆత్మహత్య

ABN , Publish Date - Aug 31 , 2026 | 03:27 PM

హైదరాబాద్‌లోని చంచల్‌గూడ జైలులో రిమాండ్ ఖైదీ ఆత్మహత్య కలకలం రేపుతోంది. కంది సాగర్(31) అనే రిమాండ్ ఖైదీ.. జైలు వాష్‌రూమ్‌లో ఉరి వేసుకుని బలవన్మరణానికి యత్నించాడు.

చంచల్‌గూడ జైలులో రిమాండ్ ఖైదీ ఆత్మహత్య
Chanchalguda Jail

హైదరాబాద్, ఆగస్టు 31: నగరంలోని చంచల్‌గూడ జైలులో రిమాండ్ ఖైదీ ఆత్మహత్య కలకలం రేపుతోంది. కంది సాగర్(31) అనే రిమాండ్ ఖైదీ.. జైలు వాష్‌రూమ్‌లో ఉరి వేసుకుని బలవన్మరణానికి యత్నించాడు. వెంటనే గుర్తించిన జైలు సిబ్బంది హుటాహుటిన సాగర్‌ను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అయితే మార్గమధ్యంలోనే ఖైదీ మృతి చెందాడు. రోడ్డు ప్రమాదం కేసులో రిమాండ్‌లో ఉన్న సాగర్‌ను ఇటీవల నిజామాబాద్ జైలు నుంచి చంచల్‌గూడ జైలుకు బదిలీ చేశారు. ఈ ఘటనపై జైలు అధికారులు దర్యాప్తు చేపట్టారు. సాగర్‌ ఆత్మహత్యకు గల కారణాలు, ఘటనకు దారితీసిన పరిస్థితులపై అధికారులు ఆరా తీస్తున్నారు.


ఇవి కూడా చదవండి...

రాజేంద్రనగర్‌లో అర్ధరాత్రి అగ్నిప్రమాదం.. ఐదు బైక్‌ల దగ్ధం

తుక్కుగూడ నర్సు హత్య కేసు.. అత్యాచారం జరిగినట్టు నిర్ధారణ

Read Latest Telangana News And Telugu News

Updated Date - Aug 31 , 2026 | 03:30 PM