Share News

హక్కుల కోసం నిలదీస్తారా? మౌనంగా తిరిగొస్తారా?

ABN , Publish Date - Nov 15 , 2026 | 05:19 AM

ఢిల్లీ పర్యటనకు వెళుతున్న సీఎం రేవంత్‌ రెడ్డి, మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి తెలంగాణ నీటి ప్రయోజనాలపై ప్రధాని మోదీని నిలదీస్తారా? తలవంచి మౌనంగా తిరిగి వస్తారా ? అని బీఆర్‌ఎస్‌ నేత, మాజీ మంత్రి హరీశ్‌రావు ప్రశ్నించారు.

హక్కుల కోసం నిలదీస్తారా? మౌనంగా తిరిగొస్తారా?
Harish Rao

  • సీఎం రేవంత్‌, ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి ఢిల్లీ

  • పర్యటనపై హరీశ్‌ రావు వ్యాఖ్యలు

హైదరాబాద్‌, నవంబరు 14 (ఆంధ్రజ్యోతి): ఢిల్లీ పర్యటనకు వెళుతున్న సీఎం రేవంత్‌ రెడ్డి, మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి తెలంగాణ నీటి ప్రయోజనాలపై ప్రధాని మోదీని నిలదీస్తారా? తలవంచి మౌనంగా తిరిగి వస్తారా ? అని బీఆర్‌ఎస్‌ నేత, మాజీ మంత్రి హరీశ్‌రావు ప్రశ్నించారు. నీటి విషయంలో రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం, కేంద్రం వివక్ష వల్ల తెలంగాణకు అన్యాయం జరుగుతోందన్నారు. తెలంగాణకు చట్టబద్ధంగా దక్కాల్సిన 968 టీఎంసీల గోదావరి జలాల వినియోగానికి సంబంధించిన అన్ని ప్రాజెక్టులకు కేంద్రం నుంచి అనుమతులు పొందడంపై ప్రధాని వద్ద స్పష్టమైన హామీ తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. 47 టీఎంసీల జలాల హైడ్రాలజీ క్లియరెన్స్‌ పూర్తయిన సమ్మక్క-సారక్క ప్రాజెక్టు డీపీఆర్‌ను కేంద్ర జలసంఘం కొత్త మార్గదర్శకాల పేరుతో వెనక్కి పంపడం దారుణమని పేర్కొన్నారు.


సమ్మక్క-సారక్క ప్రాజెక్టుకు కేవలం టీఏసీ అనుమతి రావాలని, అలాంటి ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లలేని అసమర్థత రాష్ట్ర ప్రభుత్వానిదని విమర్శించారు. కేంద్రం వద్ద తెలంగాణ వాదనను బలంగా వినిపించే చిత్తశుద్ధి రేవంత్‌ ప్రభుత్వాని కి లేకపోవడం సిగ్గుచేటన్నారు. మరోవైపు ఏపీ సీఎం చంద్రబాబు ఆరు నెలలుగా పోలవరం-బనకచర్ల ప్రాజెక్టు గురిం చి ప్రతి వేదికపై మాట్లాడుతున్నారని గుర్తు చేశారు. తెలంగాణకు చెందాల్సిన జలాలను లేకుండా చేస్తూ, తెలంగాణకు సంబంధించిన జాతీయ ప్రాజెక్టును పూర్తిగా పక్కనపెట్టి ఏపీకి అనుకూలంగా మార్చే కుట్రను సహించేది లేదని హరీశ్‌ స్పష్టం చేశారు. కాగా, ఇందిరా గాంధీ, రాజీవ్‌ గాంధీ పేర్లలో పథకాలు పెట్టడం కాకుండా ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తూ హరీశ్‌రావు శనివారం ఎక్స్‌లో ఓ పోస్టు చేశారు.


కవిత రాజకీయాలకు పనికిరారు: ఆర్‌ఎస్‌

తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత రాజకీయాలకు పనికిరారని, ఆమె రాజకీయ సన్యాసం తీసుకోవాలని బీఆర్‌ఎస్‌ ప్రధాన కార్యదర్శి ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ అన్నారు. రేవంత్‌ రెడ్డి సౌజన్యంతో పాంచజన్యం అజెండాతో టీఆర్‌ఎస్‌ ఏర్పాటు చేశారని, ఇందుకు సంబంధించిన ఆధారాలు ప్రజల ముందు బయటపెడతానని తెలిపారు. శనివారం బీఆర్‌ఎస్‌ కార్యాలయం తెలంగాణ భవన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. అధికార పక్షాన్ని నిలదీయాల్సిన కవిత బీఆర్‌ఎస్‌ను విమర్శిస్తున్నారన్నారు. కాంగ్రె్‌సకు నాలుగో అనుబంధ సంస్థగా టీఆర్‌ఎస్‌, రేవంత్‌ రక్షణ సేనగా పనిచేస్తోందని ఆరోపించారు. రేవంత్‌ రెడ్డి కవితను సిద్దిపేటకు వెళ్లమని చెప్పి.. స్ర్కిప్ట్‌ ఇచ్చారని అన్నారు. కవితకు కామన్‌సెన్స్‌ లేదంటూ ఎద్దేవా చేశారు. కొండపోచమ్మ సాగర్‌ నుంచి కేసీఆర్‌ ఫాంహౌస్‌కు నీళ్లు వెళితే కవితకు ఏం ఇబ్బందని ప్రశ్నించారు. బీఆర్‌ఎస్‌ నేతలపై కవిత చే సిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామని ఆయన తెలిపారు.


నిరుద్యోగులతో రాహుల్‌ గాంధీ చాయ్‌ తాగాలి

భారత్‌ సమ్మిట్‌ కోసం హైదరాబాద్‌ వచ్చిన రాహుల్‌ గాంధీ.. చిక్కడపల్లి సెంట్రల్‌ లైబ్రరీ, అశోక్‌ నగర్‌ వద్దకు వచ్చి నిరుద్యోగులతో కలిసి చాయ్‌ తాగాలని, 6 లక్షల ఉద్యోగాల హామీపై స్పష్టత ఇవ్వాలని ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు, బీఆర్‌ఎస్వీ నాయకులు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు అశోక్‌ నగర్‌లో శనివారం ఓ కుర్చీని ఏర్పాటు చేసి, దానికి రాహుల్‌ గాంధీ ఫొటో అతికించారు. అక్కడ బీఆర్‌ఎస్వీ నాయకులు, పలువురు విద్యార్థులు చాయ్‌ తాగుతూ తమ నిరసన వ్యక్తం చేశారు.


దీక్షా దివాస్‌ సభ విజయవంతం చెయ్యండి

మానకొండూరు నియోజకవర్గం అలుగునూరులో ఈ నెల 29న నిర్వహిస్తున్న దీక్షా దివాస్‌ బహిరంగ సభను విజయవంతం చేయాలని ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా బీఆర్‌ఎస్‌ నాయకులు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ మేరకు మాజీ మంత్రులు గంగుల కమలాకర్‌, టి. జీవన్‌ రెడ్డి, కొప్పుల ఈశ్వర్‌, మాజీ ఎంపీ వినోద్‌ కుమార్‌, మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌ శనివారం విలేకరులతో మాట్లాడారు. చరిత్ర మలుపు తిరిగిన రోజు నవంబరు 29 అని, నాడు కేసీఆర్‌ ఆమరణ దీక్ష చెయ్యకపోతే ఢిల్లీ దిగి వచ్చేది కాదన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

రాహుల్‌పై కక్ష.. తెలంగాణపై వివక్ష

విభేదిస్తే దేశ ద్రోహులంటారా?

ఆంధ్రజ్యోతి- ఏబీఎన్‌ కొత్త కార్యాలయానికి సీఎం రేవంత్‌

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Nov 15 , 2026 | 05:19 AM