పుష్కరాల పనుల్లో జాప్యానికి తావివ్వొద్దు
ABN , Publish Date - Nov 07 , 2026 | 05:10 AM
గోదావరి పుష్కరాలకు వచ్చే లక్షలాది మంది భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, అన్ని వసతులు కల్పిస్తూ.. పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అధికారులను ఆదేశించారు.
భక్తులకు అన్ని వసతులు కల్పించాలి: మంత్రి అడ్లూరి
హైదరాబాద్, నవంబరు 6 (ఆంధ్రజ్యోతి) : గోదావరి పుష్కరాలకు వచ్చే లక్షలాది మంది భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, అన్ని వసతులు కల్పిస్తూ.. పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అధికారులను ఆదేశించారు. 2027లో జరగనున్న గోదావరి పుష్కరాల సందర్భంగా చేపట్టిన అభివృద్ధి పనులను నిర్ణీత గడువులో పూర్తి చేయడంతోపాటు, పూర్తయిన పనుల నాణ్యతను పరిశీలించి, మిగిలిన పనులను యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని స్పష్టం చేశారు.
జగిత్యాల జిల్లా ధర్మపురి తదితర ప్రాంతాల్లో చేపడుతోన్న అభివృద్ధి పనుల పురోగతిపై మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పుష్కరాల పనుల్లో నీటిపారుదల, పంచాయతీరాజ్, రోడ్లు-భవనాలు (ఆర్‌అండ్‌బీ), దేవాదాయ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని చెప్పారు. ఒక శాఖ పనుల వల్ల మరో శాఖ పనులకు ఆటంకం కలగకుండా ముందస్తు కార్యాచరణతో ముందుకు సాగాలని సూచించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
కొడంగల్‌లో రేపటి నుంచి సీఎం పర్యటన
Read Latest AP News And Telangana News And National News
And Telugu News