Share News

గాంధీకొచ్చారు.. అమ్మానాన్నలయ్యారు..

ABN , Publish Date - Nov 20 , 2026 | 12:59 AM

రాష్ట్రంలోని వేర్వేరు ప్రాంతాలకు చెందిన దంపతులు వారు. అమ్మా, నాన్న.. అనే పిలుపు కోసం ఏళ్లుగా నిరీక్షిస్తున్నారు.

గాంధీకొచ్చారు.. అమ్మానాన్నలయ్యారు..
Gandhi Hospital IVF

  • సికింద్రాబాద్‌ గాంధీ ఆస్పత్రి మదర్‌, చైల్డ్‌ హెల్త్‌ సెంటర్‌లో ఐవీఎఫ్‌ చికిత్స

  • ఏళ్లుగా సంతానం కోసం చూస్తున్న మూడు జంటలకు సంతానభాగ్యం

అడ్డగుట్ట, నవంబరు 19 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని వేర్వేరు ప్రాంతాలకు చెందిన దంపతులు వారు. అమ్మా, నాన్న.. అనే పిలుపు కోసం ఏళ్లుగా నిరీక్షిస్తున్నారు. సంతానం కోసం ప్రైవేటు ఆస్పత్రుల చుట్టూ తిరిగి రూ.లక్షలు ఖర్చు పెట్టారు. కానీ ఎలాంటి ఫలితం కనిపించలేదు. ఇక తమ కల నెరవేరడం అసాధ్యమని అనుకుంటున్న తరుణంలో.. సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రి తల్లిదండ్రులు కావాలనే ఆ మూడు జంటల కలను నిజం చేసింది. గాంధీ ఆస్పత్రిలోని మదర్‌ అండ్‌ చైల్డ్‌ హెల్త్‌(ఎంసీహెచ్‌) సెంటర్‌ ద్వారా ఐవీఎఫ్‌ చికిత్స పొందిన ముగ్గురు దంపతులు తల్లిదండ్రులయ్యారు. ఇందుకు సంబంధించి గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ ఉషారాణి తెలిపిన వివరాలిలా ఉన్నాయి.


వరంగల్‌ ప్రాంతానికి చెందిన దాసరి రాజు, స్వరూప(35) దంపతులు 16 ఏళ్లుగా సంతానలేమితో బాధపడుతున్నారు. సంతాన కోసం ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లి రూ.4లక్షల దాకా ఖర్చు పెట్టారు. వికారాబాద్‌, తాండూర్‌ మండలానికి చెందిన అనంతయ్య, శనమ్మ (28) దంపతులు తొమ్మిదేళ్లుగా సంతానలేమితో బాధపడుతున్నారు. ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లి రూ.3 లక్షల దాకా ఖర్చు చేశారు. ఇక, భువనగిరి జిల్లా యాదాద్రి ప్రాంతానికి చెందిన విజయ్‌ కుమార్‌, పీసరి మాధవి (35) దంపతులు పదేళ్లుగా సంతానలేమితో ఇబ్బంది పడుతున్నారు. కొన్ని నెలల క్రితం గాంధీ ఆస్పత్రికి వచ్చిన ఈ మూడు జంటలు ఆస్పత్రిలోని ఎంసీహెచ్‌ ఐవీఎఫ్‌ కేంద్రంలో చికిత్స పొందాయి. ఈ చికిత్స విజయవంతం కాగా దాసరి స్వరూప 1.8 కిలోల బరువున్న మగ బిడ్డకు జన్మనిచ్మింది. శనమ్మ ఈ నెల 18న 2.75 కిలోల బరువు ఉన్న మగ బిడ్డను ప్రసవించింది. ఇక, మాధవి ఈ నెల 18న సిజేరియన్‌ ద్వారా 2.4 కిలోల బరువు ఉన్న ఆడ బిడ్డకు జన్మనిచ్చింది. సంతానం కలగడంతో ఆ మూడు జంటలు అంతులేని ఆనందంలో ఉన్నాయి.


ఇవి కూడా చదవండి...

సిరాజ్‌ను ఎందుకు పక్కన పెట్టారు?.. టీమిండియా ఎంపికపై గావస్కర్

హైదరాబాద్‌లో డ్రగ్స్ కింగ్‌పిన్ అరెస్ట్.. 51 గ్రాముల ఎమ్‌డీఎమ్‌ఏ స్వాధీనం

Read latest Telangana News And Telugu NEws

Updated Date - Nov 20 , 2026 | 01:02 AM