గద్వాల కోర్టు భవనాల పనులకు ఆదేశాలివ్వండి
ABN , Publish Date - Nov 08 , 2026 | 05:03 AM
జోగులాంబ గద్వాల జిల్లా పూడూరు గ్రామంలో సమీకృత జిల్లా కోర్టు భవన సముదాయం పనులు చేపట్టేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలయింది.
హైదరాబాద్, నవంబరు 7 (ఆంధ్రజ్యోతి): జోగులాంబ గద్వాల జిల్లా పూడూరు గ్రామంలో సమీకృత జిల్లా కోర్టు భవన సముదాయం పనులు చేపట్టేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలయింది. ఇందుకోసం పదెకరాలు కేటాయించినప్పటికీ శంకుస్థాపన కూడా జరగలేదని పేర్కొంటూ న్యాయవాది షఫీవుల్లా ఈ పిటిషన్ దాఖలు చేశారు.
ప్రస్తుతంనాలుగు వేర్వేరు ప్రాంతాల్లో కోర్టులు కొనసాగుతుండటంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని, మహిళా న్యాయవాదులకు ప్రత్యేక మరుగుదొడ్లు కూడా లేవని తెలిపారు. వాదనలు విన్న ధర్మాసనం తీర్పును వాయిదా వేసింది.
ఈ వార్తలు కూడా చదవండి..
Read Latest Telangana News And AP News And National News
And Telugu News