Share News

రాంగ్‌ రూట్‌లో వచ్చిన స్కూటీని ఢీకొన్న బుల్లెట్.. ఇద్దరి మృతి

ABN , Publish Date - Jun 26 , 2026 | 10:10 AM

హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. రాంగ్ రూట్‌లో వచ్చిన స్కూటీని.. బుల్లెట్ వాహనం ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది.

రాంగ్‌ రూట్‌లో వచ్చిన స్కూటీని ఢీకొన్న బుల్లెట్.. ఇద్దరి మృతి
Road Accident

హైదరాబాద్, జూన్ 26: నగరంలోని గచ్చిబౌలిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. రాంగ్ రూట్‌లో వచ్చిన స్కూటీని.. బుల్లెట్ వాహనం ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. స్కూటీపై ప్రయాణిస్తున్న ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. బుల్లెట్‌పై ప్రయాణిస్తున్న ఓ వ్యక్తికి స్వల్పగాయాలయ్యాయి. గచ్చిబౌలి AMB మాల్ ఫ్లై ఓవర్‌పై ఈ ఘటన చోటు చేసుకుంది. వినోద్ అనే వ్యక్తి ఈరోజు(శుక్రవారం) ఉదయం 7:30 గంటల ప్రాంతంలో తన బుల్లెట్‌ బైక్‌పై గచ్చిబౌలి నుంచి హఫీజ్‌పేట్ వైపు వెళ్తున్నారు. అదే సమయంలో హఫీజ్‌పేట్‌ నుంచి గచ్చిబౌలి వైపు రాంగ్ రూట్‌లో AMB మాల్ ఫ్లై ఓవర్ మీదుగా శ్రీకాంత్, విట్టల్ స్కూటీపై వెళ్తున్నారు.


ఈ క్రమంలో రెండు వాహనాలు ఒకదానికొకటి బలంగా ఢీకొన్నాయి. స్కూటీపై ప్రయాణిస్తున్న ఇద్దరు మృతిచెందగా.. బుల్లెట్‌పై ప్రయాణిస్తున్న వ్యక్తి స్వల్పంగా గాయపడ్డాడు. సమాచారం అందిన వెంటనే గచ్చిబౌలి పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


ఇవి కూడా చదవండి..

అన్నమయ్య జిల్లాలో రోడ్డు ప్రమాదం.. మంత్రి మండిపల్లి దిగ్భ్రాంతి

కోనసీమలో రోడ్డు ప్రమాదం.. టీడీపీ నేత మృతి

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jun 26 , 2026 | 10:12 AM