ఇష్టం లేదని చెప్పినా కేతన్ వినలేదు.. పుణె హత్య కేసులో మరో ట్విస్ట్..
ABN , Publish Date - Jun 26 , 2026 | 09:35 AM
దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన పుణె లోహగడ్ కోట హత్య కేసు దర్యాప్తులో మరో కీలక పరిణామం వెలుగులోకి వచ్చింది. హత్య కేసులో అరెస్టైన సియా గోయల్ పోలీసుల విచారణలో సంచలన విషయం వెల్లడించినట్టు తెలుస్తోంది.
దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన పుణె లోహగడ్ కోట హత్య కేసు దర్యాప్తులో మరో కీలక పరిణామం వెలుగులోకి వచ్చింది. హత్య కేసులో అరెస్టైన సియా గోయల్ పోలీసుల విచారణలో సంచలన విషయం వెల్లడించినట్టు తెలుస్తోంది. తనకు పెళ్లి ఇష్టం లేదని కేతన్ అగర్వాల్‌కు ముందుగానే చెప్పానని, అతడు నిశ్చితార్థాన్ని రద్దు చేసుకోవడానికి అంగీకరించలేదని సియా తెలిపినట్లు దర్యాప్తు వర్గాలు వెల్లడించాయి (Pune fort killing).
పోలీసుల కథనం ప్రకారం.. చేతన్ చౌధరితో సియా గోయల్ ప్రేమలో ఉంది. ఆమెకు కేతన్‌ను వివాహం చేసుకోవడం ఇష్టం లేదు. ఆ విషయాన్ని కేతన్‌కు సియా చెప్పింది. 'నాది చాలా ధనిక కుటుంబం. చాలా ప్రభావవంతమైనది. పారిపోవడానికి ప్రయత్నించినా ఈ పెళ్లి నుంచి తప్పించుకోలేవు' అని తనతో కేతన్ అన్నట్టు పోలీసులకు సియా చెప్పింది. సియా వాదనలను పోలీసులు ఇతర ఆధారాలతో సరిపోల్చి పరిశీలిస్తున్నారు (Ketan Agarwal, Siya Goyal).
కాగా, ప్రస్తుతం పోలీసుల విచారణలో, సియా గోయల్, చేతన్ చౌధరి ఒకరిపై ఒకరు నేరారోపణలు చేసుకుంటున్నట్టు సమాచారం (Pune crime news). ఈ నేరానికి సూత్రధారి ఎవరనే ప్రశ్నకు, ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారని పోలీసులు వెల్లడించారు. సియాతో కలిసి పారిపోవడమే తన లక్ష్యమని, హత్యకు ఆమెనే పురికొల్పిందని చేతన్ పోలీసులకు చెప్పాడు. అయితే ఈ హత్య ఆలోచన చేతన్‌దేనని, జూన్ 14న జరిగిన హత్యాయత్నం విఫలమైన తర్వాత అతడు తన ముందు కన్నీళ్లు పెట్టుకున్నాడని సియా తెలిపింది.
ఇవి కూడా చదవండి..
మద్యం మత్తులో పెళ్లికి వచ్చిన వరుడు.. వధువు ఏం చేసిందంటే..
స్థిరంగా బంగారం ధరలు.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..