Share News

భారత్‌లో వాట్సాప్ ప్లస్ ప్రారంభం.. నెలకు రూ.79 చెల్లిస్తే లభించే ప్రత్యేక సదుపాయాలేంటి..

ABN , Publish Date - Jun 26 , 2026 | 08:59 AM

ప్రపంచవ్యాప్తంగా అత్యధిక శాతం మంది ఉపయోగించే మెసేజింగ్ సర్వీస్ యాప్ 'వాట్సాప్'. తాజాగా వాట్సాప్ వినియోగదారుల కోసం మెటా సంస్థ 'వాట్సాప్ ప్లస్' పేరుతో పెయిడ్ సర్వీసెస్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది.

భారత్‌లో వాట్సాప్ ప్లస్ ప్రారంభం.. నెలకు రూ.79 చెల్లిస్తే లభించే ప్రత్యేక సదుపాయాలేంటి..
WhatsApp Plus India

ప్రపంచవ్యాప్తంగా అత్యధిక శాతం మంది ఉపయోగించే మెసేజింగ్ సర్వీస్ యాప్ 'వాట్సాప్'. తాజాగా వాట్సాప్ వినియోగదారుల కోసం మెటా సంస్థ 'వాట్సాప్ ప్లస్' పేరుతో పెయిడ్ సర్వీసెస్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. నెలకు రూ.79 చెల్లించే వినియోగదారులకు పలు అదనపు ప్రయోజనాలు లభించనున్నాయి. మొదటి నెల రోజులు ఉచితంగానే ఆ ప్రయోజనాలను పొందవచ్చు (WhatsApp Plus India).


వాట్సాప్ ప్లస్‌లో లభించే ప్రత్యేక సదుపాయాలు ఇవే (Meta WhatsApp Plus)..

  • వ్యక్తిగత అభిరుచికి అనుగుణంగా థీమ్‌లు మార్చుకోవచ్చు

  • వాట్సాప్ లోగోను నచ్చినట్టు మార్చుకునే సదుపాయం

  • వ్యక్తిగత రింగ్‌టోన్‌లు

  • ప్రత్యేక స్టిక్కర్ ప్యాక్‌లు

  • కృత్రిమ మేధస్సుతో రూపొందించే ఎమోజీలు

  • అవసరానికి అనుగుణంగా చాట్ జాబితాలను కస్టమైజ్ చేసుకునే సదుపాయం

  • ఒకేసారి 20 చాట్‌లను పిన్ చేసుకునే అవకాశం


సభ్యత్వం తీసుకోవడం ఎలా (WhatsApp subscription)..

వాట్సాప్‌లో సెట్టింగ్స్ విభాగానికి వెళ్లి సబ్‌స్క్రిప్షన్స్ ఎంపికలో వాట్సాప్ ప్లస్‌‌ను ఎంచుకుని చెల్లింపు పూర్తి చేస్తే సభ్యత్వం ప్రారంభమవుతుంది. ప్రస్తుతం ఈ సేవను దశలవారీగా విడుదల చేస్తున్నందున కొంతమంది వినియోగదారులకు వెంటనే కనిపించకపోవచ్చు.

వాట్సాప్ రూపాన్ని, అనుభవాన్ని తమ అభిరుచికి అనుగుణంగా మార్చుకోవాలనుకునే వారికి వాట్సాప్ ప్లస్ ఉపయోగపడుతుంది. సాధారణ సందేశాలు, కాల్స్ చాలు అనుకునేవారికి ఉచిత వెర్షన్‌లోనే అన్ని ముఖ్యమైన సేవలు అందుబాటులో ఉంటాయి.


ఇవి కూడా చదవండి..

మద్యం మత్తులో పెళ్లికి వచ్చిన వరుడు.. వధువు ఏం చేసిందంటే..


స్థిరంగా బంగారం ధరలు.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..

Updated Date - Jun 26 , 2026 | 10:48 AM