Share News

సికింద్రాబాద్‌లో అగ్నిప్రమాదం..

ABN , Publish Date - Jun 25 , 2026 | 03:31 PM

సికింద్రాబాద్‌లో గురువారం అగ్ని ప్రమాదం సంభవించింది. స్థానిక స్వప్నలోక్ కాంప్లెక్స్‌ పక్కన ఉన్న సూర్య కిరణ్ బిల్డింగ్ మొదటి అంతస్తులో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే..

సికింద్రాబాద్‌లో అగ్నిప్రమాదం..
Hyderabad Fire Accident,

హైదరాబాద్, జూన్ 2: సికింద్రాబాద్‌లో గురువారం అగ్ని ప్రమాదం సంభవించింది. స్వప్నలోక్ కాంప్లెక్స్‌ పక్కన ఉన్న సూర్య కిరణ్ బిల్డింగ్ మొదటి అంతస్తులో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. భవనం నుంచి పొగ, మంటలు ఎగసిపడటంతో పరిసర ప్రాంతాల్లో కలకలం రేగింది. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అగ్నిప్రమాదం కారణంగా భవనంలోని పలు అంతస్తులు పొగతో నిండిపోయాయి. భవనంలో ఉన్న వారిని సురక్షితంగా బయటకు తరలించే చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.


షార్ట్ సర్క్యూట్‌తో మంటలు చెలరేగినట్లు అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గతంలో స్వప్నలోక్ కాంప్లెక్స్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించిన విషయం తెలిసిందే. తాజాగా మరోసారి అగ్నిప్రమాదం చోటుచేసుకోవడంతో భవనంలో భద్రతా ప్రమాణాలపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ప్రమాదానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - Jun 25 , 2026 | 03:40 PM