నేను ఒకరు ఆడించినట్టు ఆడే వ్యక్తిని కాదు: ఎంపీ ఈటల
ABN , Publish Date - Jul 10 , 2026 | 12:36 PM
కాళేశ్వరం విషయంలో డ్రామాలు ఆడుతున్నారని కాంగ్రెస్ ప్రభుత్వం, బీఆర్‌ఎస్‌పై బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ రిపేర్ చేయకుండా ఎందుకు జాప్యం చేస్తున్నారని ప్రశ్నించారు.
హైదరాబాద్, జులై 10: కాళేశ్వరం విషయంలో డ్రామాలు ఆడుతున్నారని కాంగ్రెస్ ప్రభుత్వం, బీఆర్‌ఎస్‌పై బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈరోజు(శుక్రవారం) మీడియాతో మాట్లాడుతూ.. కాళేశ్వరం ప్రాజెక్ట్ రిపేర్ చేయకుండా ఎందుకు జాప్యం చేస్తున్నారని ప్రశ్నించారు. ఉత్తర తెలంగాణకు నీళ్ల జంక్షన్ మిడ్ మానేరు అని తెలిపారు. కరువు వస్తుందని తెలిసీ ఎందుకు ఇలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. లోలెవల్ పాయింట్‌కు వచ్చే నీటిని ఎందుకు ఎత్తిపోయడం లేదని ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపించారు.
‘నేను తెలంగాణ మట్టిబిడ్డను.. ఉద్యమకారున్ని.. అదే నా గుర్తింపు. నాకు తెలంగాణ ఫస్ట్.. తర్వాతే పార్టీ.. వ్యక్తిగతం. రాజకీయాల కోసం తెలంగాణ ప్రజలకు నష్టం జరుగుతుంటే చూస్తూ ఊరుకోను. చీల్చి చెండాడుతా. నేను ఒకరు ఆడించినట్టు ఆడే వ్యక్తిని కాదు. మేము స్వయం ప్రకాశితులం. ఎవరో మాట్లాడిస్తేనో.. స్క్రిప్ట్ రాసి ఇస్తేనో.. ఎవరి మెప్పుకోసమో మాట్లాడేవాళ్లం కాదు. అలా ఆరోపించే నీచులకు నేను సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. నేను కాంగ్రెస్ పార్టీని, ఇంకో పార్టీని తిట్టడానికి రాలేదు. పని చేయాల్సిన వారిని అడుగుతున్నా. దేవాదులకు బెరాజ్ లేదు.. లేకుండానే నీళ్ల పంపు చేస్తున్నారు. మేడిగడ్డలో నీళ్లు నింపమని అడగడం లేదు.. ఉన్న నీళ్లను పంప్ చేయమని అడుగుతున్నా. రాజకీయాలు చేసి రైతులను ఇబ్బంది పడితే ఖబర్దార్. హైదరాబాద్‌కి ఇప్పుడే 107 MGD నీళ్ల సరఫరా తక్కువ ఉంది. నీటి కొరత వస్తే ఎటు పోవాలి’ అని ఈటల రాజేందర్ పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి...
అరుదైన మైలురాయిని అందుకున్న అక్షర్ పటేల్
ఈనెల 20లోపు సింగరేణిలో డిపెండెంట్ ఉద్యోగాలపై స్పష్టత ఇవ్వాల్సిందే: కవిత
Read Latest Telangana News And Telugu News