Share News

ఆసియా క్రీడల్లో ఈషా సింగ్‌కు వెండి పతకం.. సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు

ABN , Publish Date - Sep 28 , 2026 | 04:32 PM

జపాన్‌లో జరుగుతోన్న 2026 ఆసియా క్రీడల్లో భారత షూటర్ ఈషా సింగ్ రజత పతకం సాధించింది. ఈ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందనలు తెలియజేశారు.

ఆసియా క్రీడల్లో ఈషా సింగ్‌కు వెండి పతకం.. సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు
CM Revanth Reddy

హైదరాబాద్, సెప్టెంబర్ 28: జపాన్‌లో జరుగుతోన్న 2026 ఆసియా క్రీడల్లో భారత షూటర్ ఈషా సింగ్ రజత పతకం సాధించింది. ఈ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందనలు తెలియజేశారు. ఆసియా క్రీడల్లో మహిళల 25 మీటర్ల పిస్టల్ వ్యక్తిగత విభాగంలో భారత స్టార్ షూటర్, తెలంగాణ ముద్దుబిడ్డ హైదరాబాద్ నగరానికి చెందిన ఈషా సింగ్ వెండి పతకం సాధించడం పట్ల ముఖ్యమంత్రి హర్షం వ్యక్తం చేశారు. ఐదుసార్లు షూటాఫ్‌లలో ఒత్తిడిని ధైర్యంగా ఎదుర్కొని, స్వల్ప తేడాతో బంగారు పతకాన్ని కోల్పోయినా ఆమె ప్రదర్శన అద్భుతమని ప్రశంసించారు. ఈషా సింగ్ పోరాట స్ఫూర్తి క్రీడాలోకానికి ఆదర్శమని పేర్కొన్నారు. భవిష్యత్తులో అంతర్జాతీయ వేదికలపై మరెన్నో గొప్ప విజయాలు అందుకొని దేశ ప్రతిష్ఠను, తెలంగాణ కీర్తిని చాటాలని సీఎం రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు.


ఆసియా క్రీడాల్లో ఈరోజు(సోమవారం) జరిగిన ఫైనల్ పోరులో టై బ్రేకర్‌లో చైనా షూటర్ జియావో చేతిలో ఈషా సింగ్ ఓడిపోయింది. స్వర్ణం కోసం చివరి వరకు పోరాడిన ఈషా.. టై బ్రేకర్‌లో మాత్రం 2-3 తేడాతో పరాజయం పాలై.. రజత పతకాన్ని సొంతం చేసుకుంది. ఫైనల్లో మొత్తం ఆరు షూటాఫ్‌లను ఈషా సింగ్ ఎదుర్కొంది. ఇందులో నాలుగు సిల్వర్‌, బ్రాంజ్‌ కోసం జరిగిన పోరు కాగా.. మరో రెండు షూటాఫ్‌లు స్వర్ణం కోసం జరిగాయి. అయితే ఒక్క షాట్ తేడాతో స్వర్ణాన్ని చేజార్చుకున్న ఈషా సింగ్.. వెండి పతకంతో సరిపెట్టుకుంది.


ఇవి కూడా చదవండి...

తెలంగాణ లోకల్ రిజర్వేషన్‌పై సుప్రీంకోర్టు స్పష్టత

కరెంట్ సమస్యపై ఆగ్రహం.. విద్యుత్ ఉద్యోగిపై కర్రతో దాడి

Read Latest Telangana News And Telugu News

Updated Date - Sep 28 , 2026 | 04:36 PM