కరెంట్ సమస్యపై ఆగ్రహం.. విద్యుత్ ఉద్యోగిపై కర్రతో దాడి
ABN , Publish Date - Sep 28 , 2026 | 03:32 PM
హైదరాబాద్‌లోని సరూర్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో విద్యుత్ ఉద్యోగిపై వినియోగదారుడి దాడి ఘటన తీవ్ర కలకలం రేపుతోంది.
హైదరాబాద్, సెప్టెంబర్ 28: నగరంలోని సరూర్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో విద్యుత్ ఉద్యోగిపై వినియోగదారుడి దాడి ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. సరూర్‌నగర్ పోచమ్మబాగుకు చెందిన శివ ఇంట్లో కరెంట్ నిలిచిపోయింది. కరెంట్ సమస్యపై సంబంధిత విద్యుత్ అధికారులకు అతడు ఫిర్యాదు చేశారు. అయితే ఇతర పనుల్లో విద్యుత్ అధికారులు ఉండటంతో సరఫరా పునరుద్ధరణలో ఆలస్యమైంది. పలుమార్లు ఫోన్ చేసినా సమస్య పరిష్కరించలేదంటూ శివ ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. నేరుగా సరూర్‌నగర్ విద్యుత్ ఏఈ కార్యాలయానికి చేరుకున్నారు.
కరెంట్ సమస్యపై కార్యాలయంలో ఆపరేటర్‌తో వాగ్వాదానికి దిగాడు. విషయం తెలుసుకున్న వెంటనే ఏఈతో పాటు విద్యుత్ ఉద్యోగి రాజిరెడ్డి కార్యాలయానికి చేరుకున్నారు. సమస్య ఏంటని రాజిరెడ్డి ప్రశ్నించడంతో శివ మరింత ఆగ్రహానికి గురయ్యాడు. విద్యుత్ ఉద్యోగిని తీవ్ర పదజాలంతో దూషించడంతో పాటు అక్కడే ఉన్న కర్ర తీసుకుని దాడి చేశాడు. ఈ దాడిలో రాజిరెడ్డికి గాయాలయ్యాయి. వెంటనే అతడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై సరూర్‌నగర్ పోలీసులకు విద్యుత్ ఉద్యోగి ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఇవి కూడా చదవండి...
రంగారెడ్డి జిల్లాలో జింక మాంసం పట్టివేత.. 8 మంది అరెస్ట్
తెలంగాణ లోకల్ రిజర్వేషన్‌పై సుప్రీంకోర్టు స్పష్టత
Read Latest Telangana News And Telugu News