Share News

చిన్న రైతులకు పెద్ద అండ.. ఈ-జేబు!

ABN , Publish Date - Nov 11 , 2026 | 05:58 AM

వ్యవసాయంలో కూలీల కొరతను అధిగమించాలని, పెట్టుబడి భారాన్ని తగ్గించాలనే లక్ష్యంతో విశ్రాంత నేవీ ఉద్యోగి వెంకట్రావు మల్లెల రూపొందించిన బహుళ ప్రయోజన వ్యవసాయ యంత్రం రైతులను విశేషంగా ఆకర్షిస్తోంది.

చిన్న రైతులకు పెద్ద అండ.. ఈ-జేబు!
E Jebu Electric Tractor

  • బ్యాటరీతో నడిచే వ్యవసాయ యంత్రం

  • 22 పరికరాలు అనుసంధానించేలా తయారీ

  • అతి తక్కువ వ్యయంతో వ్యవసాయ పనులు

హైదరాబాద్‌, నవంబరు 10 (ఆంధ్రజ్యోతి): వ్యవసాయంలో కూలీల కొరతను అధిగమించాలని, పెట్టుబడి భారాన్ని తగ్గించాలనే లక్ష్యంతో విశ్రాంత నేవీ ఉద్యోగి వెంకట్రావు మల్లెల రూపొందించిన బహుళ ప్రయోజన వ్యవసాయ యంత్రం రైతులను విశేషంగా ఆకర్షిస్తోంది. చిన్న, సన్నకారు రైతులకు అనువుగా హైదరాబాద్‌కు చెందిన ‘ఇనవ్‌ ఆగ్రో మెక్‌’ సంస్థ బ్యాటరీ ఆధారిత ఈవీ మినీ ట్రాక్టర్‌ను ‘ఈ-జేబు’ పేరుతో అందుబాటులోకి తీసుకొచ్చింది. అంతర వ్యవసాయం, నేల పనులు, కలుపు నివారణ, మందుల పిచికారీ, పంట ఉత్పత్తుల రవాణా లాంటి అన్నిరకాల వ్యవసాయ పనులు చేసుకోవటానికి వీలుగా 22 రకాల పనిముట్లను ఈ యంత్రానికి అమర్చుకోవచ్చు. ఈ సంఖ్యను 72కు పెంచేందుకూ కసరత్తు జరుగుతోంది. అంతేకాదు.. పంట ఉత్పత్తులు, ఇతర సామగ్రిని తరలించటానికి 200 కిలోల బరువును మోయగలిగే ఒక తొట్టి(క్యారియర్‌)ని అమర్చుకోవచ్చు. 3 ఫీట్ల వెడల్పు, ఏడున్నర ఫీట్ల పొడవు, 5కేవీ బ్యాటరీ కెపాసిటీతో రూపొందించిన ఈ యంత్రంతో.. ఒక రైతు కుటుంబం 20 ఎకరాల్లో సులువుగా వ్యవసాయం చేసుకోవచ్చని ఉత్పత్తిదారులు చెబుతున్నారు.


ఇందులో ఉన్న బ్యాటరీ... 3 గంటల్లోనే 100 శాతం చార్జ్‌ అయ్యేలా రూపొందించారు. ఈ-జేబు ధరను రూ. 2.76లక్షలుగా నిర్ణయించారు. చర్లపల్లి ఇండస్ట్రియల్‌ కారిడార్‌లో ఉన్న వర్క్‌షాపులో ప్రతి 45 రోజుల్లో 30 ఈ-జీపు వాహనాలను తయారు చేస్తున్నారు. నెలకు 300 వాహనాలు తయారు చేసే లక్ష్యంతో గుడిమల్కాపూర్‌లో ప్లాంటు ఏర్పాటు చేస్తున్నారు. మెట్ట పంటలు, అంతర వ్యవసాయానికి ఇది చాలా ఉపయోగపడుతుందని, ట్రాక్టర్లతో పని లేకుండా చిన్న, సన్నకారు రైతులు వ్యవసాయం చేసుకోవచ్చని ఇనస్‌ ఆగ్రో మెక్‌ సంస్థ వ్యవస్థాపకుడు మల్లెల వెంకట్రావు తెలిపారు. ‘‘భారీ ట్రాక్టర్లు, యంత్రాలు వ్యవసాయంలోకి వచ్చిన తర్వాత వ్యవసాయం గాడి తప్పింది. రైతులు చిన్న యంత్రంతో వ్యవసాయం చేస్తే కూలీల ఖర్చులన్నీ తగ్గిపోతాయి. ఒకే యంత్రంతో వీలైనన్ని ఎక్కువ పనులు చేసేలా జాగ్రత్తలు తీసుకోవాలి’’ అని ఆయన పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి.

విద్యాసంస్థల్లో సినిమా కార్యక్రమాలు నిషేధం!

రొమ్ము నుంచి ఇతర అవయవాలకు క్యాన్సర్‌!

ఆరోపణలపై నిష్పాక్షిక విచారణ జరిపించాలి

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Nov 11 , 2026 | 05:58 AM