Share News

గాంధీభవన్‌లో సమావేశానికి దామోదర డుమ్మా.. వెనుదిరిగిన మహేశ్ గౌడ్

ABN , Publish Date - Nov 05 , 2026 | 02:47 PM

మంత్రి దామోదర రాజనర్సింహ, జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు మధ్య జరిగిన వివాదాన్ని పరిష్కరించేందుకు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సిద్ధమయ్యారు.

గాంధీభవన్‌లో సమావేశానికి దామోదర డుమ్మా.. వెనుదిరిగిన మహేశ్ గౌడ్
Mahesh Kumar Goud

హైదరాబాబాద్, నవంబర్ 5: మంత్రి దామోదర రాజనర్సింహ, జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు మధ్య జరిగిన వివాదాన్ని పరిష్కరించేందుకు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సిద్ధమయ్యారు. వీరిరువురినీ ఈరోజు గాంధీభవన్‌కు రావాల్సిందిగా పిలిచారు. అయితే తాను రావడం లేదంటూ మంత్రి సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. ఢిల్లీ పంచాయితీపై చర్చించేందుకు గాంధీ భవన్‌కు రావాల్సిందిగా మంత్రి, ఎమ్మెల్యేను పీసీసీ చీఫ్ ఆదేశించారు. ఉదయం మంత్రితో, మధ్యాహ్నం ఎమ్మెల్యేతో మాట్లాడాలని నిర్ణయించారు. అసలు ఏం జరిగింది.. పరిష్కార మార్గం ఏంటి అనే దానిపై ఇద్దరితో విడివిడిగా మాట్లాడాలని భావించారు.


మొదట పీసీసీతో భేటీకి దామోదర ఓకే చెప్పారు. దీంతో మంత్రితో సమావేశమయ్యేందుకు మహేశ్‌కుమార్ గాంధీభవన్‌కు వచ్చారు. పీసీసీ చీఫ్ వచ్చిన తర్వాత తాను రావడం లేదంటూ మంత్రి సమాచారం ఇచ్చారు. దీంతో దామోదర్ రాజనరసింహ రాకపోవటంతో గాంధీభవన్ నుంచి మహేశ్‌ కుమార్‌ గౌడ్ వెళ్లిపోయారు. ఎమ్మెల్యేను కూడా కలవకుండానే టీపీసీసీ అధ్యక్షుడు వెనుదిరిగారు.


ఇవి కూడా చదవండి...

రాప్తాడులో ప్రశాంతంగా పరిషత్ పోలింగ్.. వైసీపీ ఆరోపణలపై పరిటాల సునీత ఫైర్

సింగరేణి కార్మికులకు కేంద్రం గుడ్‌న్యూస్.. రూ.1.10 లక్షల దీపావళి బోనస్

Read Latest Telangana News And Telugu News

Updated Date - Nov 05 , 2026 | 02:54 PM