అక్రమ పాన్ మసాలా, పొగాకు ఉత్పత్తి కేంద్రాల్లో సోదాలు
ABN , Publish Date - Sep 03 , 2026 | 02:08 AM
పాన్ మసాలా, ఇతర పొగాకు ఉత్పత్తుల అక్రమ వ్యాపారం, నిల్వ, తయారీ కేంద్రాల్లో రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ అధికారులు తనిఖీలు చేపట్టారు.
పెద్ద మొత్తంలో ముడిపదార్థాలు, రసాయనాలు, సామగ్రి స్వాధీనం
హైదరాబాద్, సెప్టెంబరు 2 (ఆంధ్రజ్యోతి): పాన్ మసాలా, ఇతర పొగాకు ఉత్పత్తుల అక్రమ వ్యాపారం, నిల్వ, తయారీ కేంద్రాల్లో రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ అధికారులు తనిఖీలు చేపట్టారు. పన్ను ఎగవేసి, అక్రమ వ్యాపారాలు నిర్వహిస్తున్నారన్న సమాచారం మేరకు నగరంలోని 25 ప్రాంతాల్లో ఈ సోదాలు చేశారు. బేగంబజార్, ఫీల్‌ఖానా, టోలిచౌకి, గోల్కొండ, బడాబజార్, లంగర్‌హౌజ్, బాబానగర్, బార్కాస్ తదితర ప్రాంతాల్లో తనిఖీలు కొనసాగాయి. ఈ సందర్భంగా బార్కాస్ సమీపంలోని ఎర్రగుంటలో అక్రమంగా పాన్‌మసాలా, గుట్కా తయారీ యూనిట్‌ను నిర్వహిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. పెద్ద మొత్తంలో ముడిపదార్థాలు, రసాయనాలు, ఇతర తయారీ సామగ్రి లభించాయి. ఆర్‌ఎండీ, గోవా-100, బాద్‌షా, జఫ్రానీ గోల్డ్, విమల్ పాన్ మసాలా వంటి వివిధ బ్రాండ్ల నకిలీ ప్యాకేజింగ్ సామగ్రి, యంత్రాలను స్వాధీనం చేసుకున్నారు. కాగా ఎంతమేర జీఎస్టీ ఎగవేశారన్న కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. అక్రమాలకు పాల్పడినవారిపై తెలంగా ణ వస్తుసేవల పన్ను చట్టం- 2017(టీజీఎస్టీ), కేంద్ర వస్తుసేవల పన్ను చట్టం-2017(సీజీఎస్టీ) ప్రకారం చర్యలు తీసుకుంటామని రాష్ట్ర వాణిజ్య ప న్నుల కమిషనరేట్ అధికారు లు ఓ ప్రకటనలో తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి..
యూట్యూబ్‌లో చూసి నకిలీ కరెన్సీ తయారీ
Read Latest Telangana News And AP News And National News
And Telugu News