క్రికెట్‌లో కోహ్లీనే మెస్సి, రొనాల్డో.. థాయ్ ఇన్‌ఫ్లుయెన్సర్ వీడియో వైరల్
ABN , Publish Date - Sep 01 , 2026 | 12:40 PM
భారత మాజీ కెప్టెన్, స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే చారిత్రక లార్డ్స్ మైదానంలో కోహ్లీని చూసిన ఓ థాయ్ ఇన్‌ఫ్లుయెన్సర్ రియాక్షన్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇంటర్నెట్ డెస్క్: భారత మాజీ కెప్టెన్, స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే చారిత్రక లార్డ్స్ మైదానంలో కోహ్లీని చూసిన ఓ థాయ్ ఇన్‌ఫ్లుయెన్సర్ రియాక్షన్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. థాయ్ స్పోర్ట్స్ కంటెంట్ క్రియేటర్ నాంజీ.. క్రికెట్‌లో కోహ్లీనే మెస్సి, రొనాల్డో అంటూ పోల్చడం అభిమానులను ఆకట్టుకుంటోంది. ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ సందర్భంగా జూన్‌లో నాంజీ లార్డ్స్ మైదానానికి వెళ్లింది. అక్కడ అనూహ్యంగా కోహ్లీతో పాటు భారత మాజీ ఓపెనర్ శిఖర్ ధావన్‌ను చూసింది. ఆ సమయంలో తీసిన వీడియో తాజాగా మరోసారి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ వీడియోకు దాదాపు మిలియన్‌కు చేరువలో వ్యూస్ రావడం విశేషం.
కోహ్లీని చూసిన వెంటనే నాంజీ ఉత్సాహంతో స్పందించింది. ‘నా పక్కనే ఎవరున్నారో తెలుసా. క్రికెట్‌లో మెస్సి, రొనాల్డో అయిన విరాట్ కోహ్లీ. ప్రపంచంలో అత్యధికంగా ఫాలో అవుతున్న ప్లేయర్లలో అతడు మూడో స్థానంలో ఉన్నాడు. భారత్‌కు చెందిన ఈ క్రికెటర్‌కు సోషల్ మీడియాలో 273 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. క్రికెట్‌కు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులు ఉన్నారు. కోహ్లీ అత్యుత్తమ ఆటగాళ్లలో ఒకడు. క్రికెటర్లను కేవలం ఆటగాళ్లుగా కాకుండా ఫిట్‌నెస్, లైఫ్‌స్టైల్ ఐకాన్‌లుగా మార్చడంలో అతడు కీలక పాత్ర పోషించాడు. లార్డ్స్‌లో భారత క్రికెట్ దిగ్గజాన్ని ప్రత్యక్షంగా చూస్తానని ఊహించలేదు. భారత మహిళల ప్రపంచకప్ మ్యాచ్‌లకు మద్దతుగా క్రికెట్‌లోని అతిపెద్ద ఐకాన్‌లలో ఒకరు రావడం అద్భుతంగా అనిపించింది’ అంటూ ఆమె తన అనుభూతిని పంచుకుంది.
ఇవి కూడా చదవండి:
యూఎస్ ఓపెన్: అల్కరాజ్ అదిరిపోయే రీఎంట్రీ.. తొలి రౌండ్‌లో ఘన విజయం
ఇంకెప్పుడు జట్టుకు అండగా ఉంటావు.. బాబర్ ఆజమ్‌పై పాక్ బ్యాటర్ ఫైర్