అఫ్గాన్ సిరీస్‌కు ముందు టీమిండియాకు షాక్.. మళ్లీ గాయపడ్డ హార్దిక్ పాండ్య!
ABN , Publish Date - Sep 01 , 2026 | 11:54 AM
అఫ్గానిస్థాన్‌తో జరగనున్న టీ20 సిరీస్‌కు ముందు టీమిండియాకు షాక్ తగిలింది. గాయం నుంచి కోలుకుని అంతర్జాతీయ క్రికెట్‌లోకి రీఎంట్రీ ఇవ్వాలని భావిస్తోన్న స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య మళ్లీ గాయపడినట్లు తెలుస్తోంది.
ఇంటర్నెట్ డెస్క్: అఫ్గానిస్థాన్‌తో జరగనున్న టీ20 సిరీస్‌కు ముందు టీమిండియాకు షాక్ తగిలింది. గాయం నుంచి కోలుకుని అంతర్జాతీయ క్రికెట్‌లోకి రీఎంట్రీ ఇవ్వాలని భావిస్తోన్న స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య మళ్లీ గాయపడినట్లు తెలుస్తోంది. తొడ కండరాల గాయంతో కొంతకాలంగా బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో హార్దిక్ కోలుకుంటున్నాడు. ఫిట్‌నెస్ సాధించాడని.. జట్టులోకి రావడానికి సిద్ధంగా ఉన్నాడని ఇటీవలే సీఓఈ వర్గాలు వెల్లడించాయి. ఈ క్రమంలో హార్దిక్ పాండ్య మళ్లీ గాయపడినట్లు తెలుస్తోంది.
ఫిట్‌నెస్ సాధించడంతో సెప్టెంబర్ 13 నుంచి అఫ్గాన్‌తో జరిగే మూడు టీ20ల సిరీస్‌కు హార్దిక్ అందుబాటులోకి వస్తాడని అంతా భావించారు. అయితే తాజాగా శిక్షణ సమయంలో అతడి కాలికి గాయమైనట్లు సమాచారం. దీంతో అఫ్గాన్‌తో సిరీస్‌కు పాండ్య రీఎంట్రీ కష్టమేనని వార్తలు వస్తున్నాయి. ఈ సిరీస్ కోసం భారత సెలక్షన్ కమిటీ ఈ వారంలో జట్టును ప్రకటించే అవకాశం ఉంది. అప్పుడే హార్దిక్ పాండ్యపై ఓ స్పష్టత రానుంది.
మార్చి తర్వాత కనిపించని హార్దిక్..
టీ20 ప్రపంచకప్ 2026 ఫైనల్లో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో హార్దిక్ చివరిసారిగా టీమిండియా తరఫున టీ20 ఆడాడు. ఆ తర్వాత గాయం కారణంగా అఫ్గానిస్థాన్‌తో వన్డే సిరీస్‌తో పాటు ఐర్లాండ్, ఇంగ్లండ్‌లతో జరిగిన వైట్‌బాల్ సిరీస్‌లు, జింబాబ్వేతో జరిగిన టీ20 సిరీస్‌లకు దూరమయ్యాడు. మరోవైపు ఆల్‌రౌండర్లు నితీశ్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్ గాయాల నుంచి కోలుకునే ప్రక్రియ ఆశాజనకంగా కొనసాగుతున్నట్లు సమాచారం. అఫ్గానిస్థాన్ సిరీస్‌కు వీరిద్దరినీ ఎంపిక చేసే విషయంలో సెలెక్టర్లు నిర్ణయం తీసుకోనున్నారు. టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు కూడా ఇంకా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ నుంచి అంతర్జాతీయ క్రికెట్‌లోకి తిరిగి రావడానికి క్లియరెన్స్ రాలేదు. 2027 వన్డే ప్రపంచకప్‌ను దృష్టిలో ఉంచుకుని బుమ్రాను ప్రధానంగా వన్డేలు, టెస్టులకు అందుబాటులో ఉంచాలని బీసీసీఐ భావిస్తోంది.
ఇవి కూడా చదవండి:
యూఎస్ ఓపెన్: అల్కరాజ్ అదిరిపోయే రీఎంట్రీ.. తొలి రౌండ్‌లో ఘన విజయం
ఇంకెప్పుడు జట్టుకు అండగా ఉంటావు.. బాబర్ ఆజమ్‌పై పాక్ బ్యాటర్ ఫైర్