Share News

ఈ-సిగరెట్లపై ఈగల్‌ నజర్‌

ABN , Publish Date - Sep 03 , 2026 | 01:46 AM

నిషేధిత ఈ-సిగరెట్ల వ్యాపారం తెలంగాణలో జోరుగా సాగుతోంది. ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫామ్‌ల్లో అందుబాటులో ఉన్న ఈ-సిగరెట్లు కొనుగోలు చేసి వాటిని మైనర్లకు విక్రయిస్తున్న ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు.

ఈ-సిగరెట్లపై ఈగల్‌ నజర్‌
E-Cigerates

  • ఆన్‌లైన్‌లో కొని మైనర్లకు అమ్ముతున్న ఇద్దరి అరెస్టు

హైదరాబాద్‌,సెప్టెంబరు 2(ఆంధ్రజ్యోతి): నిషేధిత ఈ-సిగరెట్ల వ్యాపారం తెలంగాణలో జోరుగా సాగుతోంది. ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫామ్‌ల్లో అందుబాటులో ఉన్న ఈ-సిగరెట్లు కొనుగోలు చేసి వాటిని మైనర్లకు విక్రయిస్తున్న ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. అలాగే, ఆన్‌లైన్‌లో ఈ-సిగరెట్లు విక్రయిస్తున్న వెబ్‌సైట్లపైనా కేసులు నమోదు చేశారు. హైదరాబాద్‌లో కొందరు బాలురు ఈ-సిగరెట్లు తాగుతున్న వీడియో ఒకటి సోషల్‌ మీడియాలో వైరలైంది. ఆ వీడియోలోని ప్రదేశాన్ని గుర్తించిన ఈగల్‌ అధికారులు ఆ ప్రాంతంలో నిఘా పెట్టారు. 15 నుంచి 17 ఏళ్ల మధ్య వయస్సున్న నలుగురు బాలురు ఈ-సిగరెట్లు తాగడానికి అక్కడి రాగా అదుపులోకి తీసుకుని సోదా చేశారు. వారి నుంచి రెండు ఈ-సిగరెట్లు స్వాధీనం చేసుకున్నారు. అలాగే వారిని విచారించగా.. ముషీరాబాద్‌ ప్రాంతానికి చెందిన ఆర్సలాన్‌ అనే విద్యార్థి ఆన్‌లైన్‌లో ఈ-సిగరెట్లు కొనుగోలు చేసి వాటిని మైనర్లకు విక్రయిస్తున్నట్టు తేలింది. అర్సలాన్‌తో పాటు మరో వ్యక్తిని అరెస్టు చేసిన పోలీసులు 13 ఈ-సిగరెట్‌ కిట్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ-సిగరెట్లు విక్రయిస్తున్న మూడు వెబ్‌సైట్లపైనా కేసులు నమోదు చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

రక్షణ తయారీ రంగంలో భారత్‌ జోరు

కవిత చేతుల్లో బీఆర్‌ఎస్‌ అక్రమాస్తుల బండారం

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Sep 03 , 2026 | 01:48 AM