Share News

ఓట్ల తొలగింపుపై సీఎం రేవంత్ రెడ్డి ఆందోళన.. SIRపై సీఈసీకి లేఖ

ABN , Publish Date - Aug 29 , 2026 | 04:10 PM

తెలంగాణలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియపై సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లేఖ రాశారు. ఓటర్ల జాబితా సవరణలో భాగంగా పెద్ద సంఖ్యలో ఓట్ల తొలగింపుపై సీఎం ఆందోళన వ్యక్తం చేశారు.

ఓట్ల తొలగింపుపై సీఎం రేవంత్ రెడ్డి ఆందోళన.. SIRపై సీఈసీకి లేఖ
CM Revanth Reddy

హైదరాబాద్, ఆగస్టు 29: : తెలంగాణలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(SIR) ప్రక్రియపై ప్రధాన ఎన్నికల కమిషనర్(సీఈసీ) జ్ఞానేశ్ కుమార్‌కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లేఖ రాశారు. ఓటర్ల జాబితా సవరణలో భాగంగా పెద్ద సంఖ్యలో ఓట్ల తొలగింపుపై సీఎం ఆందోళన వ్యక్తం చేశారు. దాదాపు 92.86 లక్షల ఓట్ల తొలగింపుకు సంబంధించిన సమగ్ర పరిశీలన అవసరమని ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లారు. SIR ప్రక్రియలో భాగంగా ఓటర్ల నుంచి క్లెయిమ్స్, అభ్యంతరాలు స్వీకరించేందుకు ప్రస్తుతం ఉన్న గడువు సరిపోదని పేర్కొన్నారు. గడువును మరో నాలుగు వారాల పాటు పొడిగించాలని కోరారు.


వలస కూలీలు, రోజువారీ కూలీలు.. తమ ఓటు హక్కు వివరాలను పరిశీలించుకునేందుకు, అవసరమైన పత్రాలను సమర్పించేందుకు అదనపు సమయం ఇవ్వాలని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్, మేడ్చల్-మల్కాజ్‌గిరి, రంగారెడ్డి జిల్లాల్లో అధిక సంఖ్యలో ఓటర్లు ఉన్నందున అదనపు సిబ్బంది అవసరమని సూచించారు. ఈ మూడు ప్రాంతాల్లో అదనపు ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్లను(EROలు) నియమించాలని కోరారు. SIR ప్రక్రియను వికేంద్రీకరించాలని సీఈసీకి రాసిన లేఖలో రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.


ఇవి కూడా చదవండి...

ప్రోటోకాల్ ఉల్లంఘన.. అధికారులపై ఎమ్మెల్యే దానం నాగేందర్ సీరియస్

తలక్రిందులుగా తపస్సు చేసినా.. వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే: మంత్రి పొంగులేటి

Read Latest Telangana News And Telugu News

Updated Date - Aug 29 , 2026 | 04:47 PM