Share News

తలక్రిందులుగా తపస్సు చేసినా.. వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే: మంత్రి పొంగులేటి

ABN , Publish Date - Aug 29 , 2026 | 03:30 PM

ధనిక తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా చేసినా సంక్షేమం ఆగలేదని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. నూతనకల్, మద్దిరాల మండలాల్లో 15 గ్రామాల్లో సుమారు మూడు వేల ఎకరాలకు సంబంధించిన భూమి పట్టాలను ఇస్తున్నామన్నారు.

తలక్రిందులుగా తపస్సు చేసినా.. వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే: మంత్రి పొంగులేటి
Minister Ponguleti Srinivas Reddy

సూర్యాపేట, ఆగస్టు 29: ధనిక తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా చేసినా సంక్షేమం ఆగలేదని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఈరోజు(శనివారం) మీడియాతో మాట్లాడుతూ.. జిల్లాలోని నూతనకల్, మద్దిరాల మండలాల్లో 15 గ్రామాల్లో సుమారు మూడు వేల ఎకరాలకు సంబంధించిన భూమి పట్టాలను అందజేస్తున్నామన్నారు. పిల్లల చదువు కోసం, అవసరాల కోసం భూమిని అమ్ముకొనే అవకాశం లేక ఇబ్బంది పడుతున్న విషయాన్ని తన దృష్టికి తీసుకవచ్చారని తెలిపారు. ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది కాబట్టే పట్టాదార్ పాస్‌బుక్కులను పంపిణీ చేస్తున్నామని చెప్పారు.


‘మీరు తలక్రిందులుగా తపస్సు చేసినా మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుంది’ అని మంత్రి స్పష్టం చేశారు. 63 వేల కోట్ల ఆడబిడ్డలకు సున్నా వడ్డీకి రుణాలు ఇచ్చామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మొదటి విడత ఇందిరమ్మ ఇళ్లు అందించామని తెలిపారు. సర్వే కోసం 70 రెవెన్యూ గ్రామాలను తీసుకున్నామని.. ఈ సర్వేతో దొంగ పట్టాలను గుర్తించవచ్చని చెప్పారు. రాబోయే సంవత్సరన్నర కాలంలో ప్రతి అంగుళం సర్వే చేస్తామన్నారు. పేదలకు ఇళ్లు ఇస్తే ప్రభుత్వంపై విషం చిమ్ముతున్నారని ప్రతిపక్షాలపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.


ఇవి కూడా చదవండి...

హైదరాబాద్ మెట్రో ఆన్‌లైన్ టికెటింగ్ సేవల్లో అంతరాయం

ప్రోటోకాల్ ఉల్లంఘన.. అధికారులపై ఎమ్మెల్యే దానం నాగేందర్ సీరియస్

Read Latest Telangana News And Telugu News

Updated Date - Aug 29 , 2026 | 03:42 PM