ప్రోటోకాల్ ఉల్లంఘన.. అధికారులపై ఎమ్మెల్యే దానం నాగేందర్ సీరియస్
ABN , Publish Date - Aug 29 , 2026 | 12:40 PM
ఖైరతాబాద్ డబుల్ బెడ్ రూంల లక్కీ డ్రాలో ప్రోటోకాల్ రగడ నెలకొంది. ప్రోటోకాల్ పాటించకపోవడంపై ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
హైదరాబాద్, ఆగస్టు 29: ఖైరతాబాద్ డబుల్ బెడ్ రూంల లక్కీ డ్రాలో ప్రోటోకాల్ రగడ నెలకొంది. ప్రోటోకాల్ పాటించకపోవడంపై ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈరోజు(శనివారం) బంజారాహిల్స్ కొమరం భీమ్ ఆదివాసీ భవన్‌లో ఖైరతాబాద్ గృహలక్ష్మి లబ్ధిదారుల ఎంపిక కోసం లక్కీ డ్రా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎమ్మెల్యే దానం నాగేందర్ ఈ కార్యక్రమంలో పాల్గొని లక్కీ డ్రా ద్వారా లబ్ధిదాలను ఎంపిక చేయాల్సి ఉంది. అయితే ఎమ్మెల్యే రాకముందే అధికారులు లక్కీ డ్రాను ప్రారంభించారు. దీనిపై దానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
తాను వచ్చేలోపే గృహలక్ష్మి లక్కీ డ్రా ప్రారంభించడంపై దానం నాగేందర్ మండిపడ్డారు. ఎమ్మెల్యే వచ్చే వరకు ఆగకుండా డ్రా ఎలా ప్రారంభిస్తారని అధికారులపై సీరియస్ అయ్యారు. ప్రోటోకాల్ ఉల్లంఘించిన అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అధికారుల తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన దానం నాగేందర్.. కార్యక్రమం మధ్యలోనే అలిగి వెళ్లిపోయారు.
కాగా.. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఫ్లాట్ల లక్కీ డ్రా హైదరాబాద్ క్యూర్ పరిధిలో కొనసాగుతోంది. కోర్ అర్బన్ ప్రాంతంలోని తొలి విడతలో నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఈ ఇళ్ల కేటాయింపు ప్రక్రియ పారదర్శకంగా జరగనుంది. నాలుగు రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.
ఇవి కూడా చదవండి...
ఇల్లందులో ప్రేమ పేరుతో యువతికి వేధింపులు.. మతం మారాలంటూ
హైదరాబాద్ మెట్రో ఆన్‌లైన్ టికెటింగ్ సేవల్లో అంతరాయం
Read Latest Telangana News And Telugu News