హైదరాబాద్ మెట్రోలో సాంకేతిక సమస్యపై అధికారుల వివరణ
ABN , Publish Date - Aug 29 , 2026 | 12:58 PM
హైదరాబాద్ మెట్రో రైళ్లలో సాంకేతిక సమస్యపై ఎల్‌అండ్‌టీ మెట్రో అధికారులు వివరణ ఇచ్చారు. మెట్రోలో ఎలాంటి సాంకేతిక లోపాలు లేవని స్పష్టం చేశారు.
హైదరాబాద్, ఆగస్టు 29: హైదరాబాద్ మెట్రో రైళ్లలో సాంకేతిక సమస్యలు తలెత్తాయంటూ వచ్చిన వార్తల నేపథ్యంలో ఎల్‌అండ్‌టీ మెట్రో అధికారులు స్పందించారు. మెట్రో రైలు సేవల్లో ఎలాంటి సాంకేతిక లోపం లేదని స్పష్టం చేశారు. ప్రస్తుతం నగరంలో మెట్రో రైలు సేవలు సాఫీగా కొనసాగుతున్నాయని వెల్లడించారు. నగరంలోని మెట్రో స్టేషన్లలోనూ ఎలాంటి సాంకేతిక ఇబ్బందులు లేవని చెప్పుకొచ్చారు. ప్రయాణికులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, మెట్రో సేవలు సాఫీగానే కొనసాగుతున్నాయని పేర్కొన్నారు.
అయితే ఎల్బీనగర్ మెట్రో స్టేషన్ వద్ద ఎంట్రీ, ఎగ్జిట్ గేట్లు ఆలస్యంగా ఓపెన్ అయ్యాయని అధికారులు తెలిపారు. స్టేషన్‌లో ప్రయాణికుల రద్దీ కారణంగానే గేట్లు తెరవడంలో కొంత ఆలస్యం జరిగిందని వివరించారు. ప్రస్తుతం ఎల్బీనగర్ సహా హైదరాబాద్‌లోని అన్ని మెట్రో స్టేషన్లలో సేవలు సాధారణ స్థితిలో కొనసాగుతున్నాయని ఎల్‌అండ్‌టీ మెట్రో అధికారులు వెల్లడించారు.
ఇవి కూడా చదవండి...
హైదరాబాద్ మెట్రో ఆన్‌లైన్ టికెటింగ్ సేవల్లో అంతరాయం
ప్రోటోకాల్ ఉల్లంఘన.. అధికారులపై ఎమ్మెల్యే దానం నాగేందర్ సీరియస్
Read Latest Telangana News And Telugu News