Share News

సీఎం రేవంత్ రెడ్డికి ప్రతిష్టాత్మక పురస్కారం.. ‘బెస్ట్ పబ్లిక్ సర్వెంట్-2026’ అవార్డుకు ఎంపిక

ABN , Publish Date - Sep 24 , 2026 | 07:08 PM

తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి ప్రతిష్టాత్మక పురస్కారం ఆర్యదాన్‌ మహమ్మద్‌-2026కు ఎంపికయ్యారు. ఈ ఏడాది బెస్ట్‌ పబ్లిక్‌ సర్వెంట్‌ అవార్డును ఆయన అందుకోనున్నారు. శుక్రవారం కేరళలోని నిలంబూరులో జరిగే కార్యక్రమంలో సీఎం రేవంత్‌ రెడ్డికి ఈ అవార్డును నిర్వాహకులు ప్రదానం చేయనున్నారు.

సీఎం రేవంత్ రెడ్డికి ప్రతిష్టాత్మక పురస్కారం.. ‘బెస్ట్ పబ్లిక్ సర్వెంట్-2026’ అవార్డుకు ఎంపిక
TG CM Revanth Reddy

హైదరాబాద్, సెప్టెంబర్ 24: తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి ప్రతిష్టాత్మక పురస్కారం ఆర్యదాన్‌ మహమ్మద్‌-2026కు ఎంపికయ్యారు. ఈ ఏడాది బెస్ట్‌ పబ్లిక్‌ సర్వెంట్‌ అవార్డును ఆయన అందుకోనున్నారు. శుక్రవారం కేరళంలోని నిలంబూరులో జరిగే కార్యక్రమంలో సీఎం రేవంత్‌ రెడ్డికి ఈ అవార్డును నిర్వాహకులు ప్రదానం చేయనున్నారు. రేవంత్ రెడ్డి పాలనలో రైతులు, బీసీలు, సామాన్య పౌరుల కోసం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలకుగాను ఆయనను ఈ పురస్కారానికి ఎంపిక చేసినట్లు నిర్వాహకుల జ్యూరీ వెల్లడించింది.


ప్రజాస్వామిక విలువలపై సీఎం రేవంత్‌ రెడ్డి నిబద్ధతను ఈ సందర్భంగా జ్యూరీ ప్రశంసించింది. ఆర్యదాన్‌ మహమ్మద్‌ నాలుగో వర్థంతి సందర్భంగా రేపు (శుక్రవారం) ఈ పురస్కారాన్ని సీఎం రేవంత్ రెడ్డి అందుకోనున్నారు. కేరళంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన దివంగత సీనియర్ నేత, మాజీ మంత్రి ఆర్యదాన్ మహమ్మద్ స్మారకార్థం ఈ పురస్కారాన్ని ఏర్పాటు చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఖైరతాబాద్ ఉప ఎన్నికల్లో బీజేపీ విజయం ఖాయం: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

క్షుద్ర పూజలు చేశానంటూ తప్పుడు ప్రచారం: కాంగ్రెస్ నేతలపై హరీశ్ రావు ఫైర్

Read Latest TG News And Telugu News

Updated Date - Sep 24 , 2026 | 07:56 PM