Share News

క్షుద్ర పూజలు చేశానంటూ తప్పుడు ప్రచారం: కాంగ్రెస్ నేతలపై హరీశ్ రావు ఫైర్

ABN , Publish Date - Sep 24 , 2026 | 04:26 PM

క్షుద్ర పూజలు చేశానని కాంగ్రెస్ పార్టీ నేతలు తనపై తప్పుడు ప్రచారం చేశారని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్‌పై అన్ని సాక్ష్యాధారాలతో కేసు ఫైల్ చేశానని చెప్పారు.

క్షుద్ర పూజలు చేశానంటూ తప్పుడు ప్రచారం: కాంగ్రెస్ నేతలపై హరీశ్ రావు ఫైర్

హైదరాబాద్, సెప్టెంబర్ 24: క్షుద్ర పూజలు చేశానని కాంగ్రెస్ పార్టీ నేతలు తనపై తప్పుడు ప్రచారం చేశారని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్‌పై అన్ని సాక్ష్యాధారాలతో కేసు ఫైల్ చేశానని చెప్పారు. ఈ విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్లానని పేర్కొన్నారు. తన పిటిషన్‌ను కోర్టు అనుమతించిందని అన్నారు. సెప్టెంబర్ 30వ తేదీన తన స్టేట్‌మెంట్ రికార్డ్ చేస్తామని కోర్టు స్పష్టం చేసిందని తెలిపారు. గురువారం నాంపల్లిలోని ప్రజాప్రతినిధుల కోర్టు వద్ద ఆయన మాట్లాడారు.


తనపై అసత్య ప్రచారాల డెఫర్మేషన్ (పరువు నష్టం) కేసు ఫైల్ చేశానని పేర్కొన్నారు. ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి ఇచ్చిన ఆరు గ్యారంటీల అమలు ఏమైందని కాంగ్రెస్ నేతలను ఈ సందర్భంగా నిలదీశారు. కాంగ్రెస్ పార్టీ డైవర్షన్ పాలిటిక్స్ పాల్పడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి మూడేళ్లైనా డిప్యూటీ స్పీకర్ నియామకం జరగలేదని ఆరోపించారు. సభ హక్కుల ఉల్లంఘన నోటీస్ ఇచ్చినా స్పీకర్ పట్టించుకునే పరిస్థితి లేదని పెదవి విరిచారు.


కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అబద్ధాలు తప్ప.. చేసింది ఏమి లేదని అన్నారు. తన విషయంలో పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, అద్దంకి దయాకర్ అబద్దాలు ప్రచారం చేస్తున్నారని నిప్పులు చెరిగారు. భవిష్యత్తులో అబద్ధాలు ప్రచారం చేస్తే ఎవరిని వదలమని స్పష్టం చేశారు. దానం నాగేందర్ విషయంలో సుప్రీంకోర్టు తీర్పు సీఎం రేవంత్ రెడ్డికి చెంపపెట్టు అని అభివర్ణించారు.


లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ.. రాజ్యాంగం సంరక్షకుడిగా వ్యవహరిస్తున్నాడని మరి ఇప్పుడు ఏమైందంటూ సందేహం వ్యక్తం చేశారు. ఎవరైతే పార్టీలు మారారో.. ఆ శాసనసభ్యులందరితో రాజీనామా చేయించాలని ఈ సందర్భంగా రాహుల్ గాంధీని ఆయన డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత అయినా పార్టీ మారిన ఎమ్మెల్యేలకు కనువిప్పు కావాలని హరీశ్ రావు పేర్కొన్నారు.


పార్టీ మారిన శాసన సభ్యులందరికీ.. దానం నాగేంద్ర తీర్పు ఎదురవుతుందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ తప్పు చేసిందని ప్రజలు తెలుసుకున్నారని అభిప్రాయపడ్డారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలను కాపాడాలని తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ ప్రయత్నించారని ఆరోపించారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలందరూ రాజీనామాలు చేయాలని ఈ సందర్భంగా తెలంగాణ అసెంబ్లీలో బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు డిమాండ్ చేశారు.


ఇవి కూడా చదవండి..

డీఎస్సీ వివాదంపై అనిత ఫైర్.. జగన్ ఆరోపణలకు 16 వేల ఉద్యోగాలతో కౌంటర్

మరో రెండు రోజులు అప్రమత్తంగా ఉండాలి.. విశాఖలో వర్షాలపై కలెక్టర్ టెలికాన్ఫరెన్స్

Read Latest TG News And Telugu News

Updated Date - Sep 24 , 2026 | 06:18 PM