Share News

నాగపూర్‌ నుంచి హైదరాబాద్‌కు.. మకాం మార్చిన ‘చేతన్‌’ డ్రగ్స్‌ ముఠా

ABN , Publish Date - Oct 20 , 2026 | 05:30 AM

డ్రగ్స్‌ దందా చేస్తున్న చేతన్‌ ముఠాలోని ప్రధాన సూత్రధారి భైరాజ్‌ కృష్ణంశెట్టిని పోలీసులు మహారాష్ట్రలోని వసాయిలో అదుపులోకి తీసుకున్నారు.

నాగపూర్‌ నుంచి హైదరాబాద్‌కు..  మకాం మార్చిన ‘చేతన్‌’ డ్రగ్స్‌ ముఠా
Chetan drug racket

హైదరాబాద్‌, అక్టోబరు 19 (ఆంధ్రజ్యోతి): డ్రగ్స్‌ దందా చేస్తున్న చేతన్‌ ముఠాలోని ప్రధాన సూత్రధారి భైరాజ్‌ కృష్ణంశెట్టిని పోలీసులు మహారాష్ట్రలోని వసాయిలో అదుపులోకి తీసుకున్నారు. డ్రగ్స్‌ రాకెట్‌కు అంతర్జాతీయ లింకులపై ఎన్‌సీబీ లోతుగా దర్యాప్తు చేస్తోంది. చేతన్‌ ముఠా నాగపూర్‌ నుంచి హైదరాబాద్‌కు మకాం మార్చింది. కొండమడుగు, మౌలాలి ఫ్యాక్టరీల్లో రియాక్టర్లు లీజుకు తీసుకుని అక్రమంగా డ్రగ్స్‌ తయారు చేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు.


వెంకటూరి ఎస్‌ఎం ల్యాబ్స్‌ ముసుగులో అల్ఫాజోలం, డ్రోఫెన్‌ హైడ్రోక్లోరిక్‌ యాసిడ్‌ తయారుచేస్తున్నారు. తయారీ యూనిట్లలో అసోం, బంగ్లాదేశ్‌ వలస కార్మికులు ఉన్నారని పోలీసులు గుర్తించారు. మౌలాలి ల్యాబ్‌పై ఆకస్మిక దాడి చేసిన పోలీసులు శ్రీనివాస్‌, లక్ష్మీకుమార్‌ సహా నలుగురిని అరెస్టు చేశారు. ఆగస్టులో చేసిన ఎన్‌సీబీ దాడుల్లో ముడిసరుకును స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే.


ఈ వార్తలు కూడా చదవండి

నెట్‌ జీరో క్యాంప్‌సగాఎన్‌ఐయూఎం ప్రాంగణం

‘ఎల్‌నినో’పై మంత్రివర్గ ఉపసంఘం

దీపావళికి నామినేటెడ్‌ ధమాకా!

Read Latest AP News And Telangana News And International

Updated Date - Oct 20 , 2026 | 05:30 AM