Share News

చర్లపల్లి రైల్వేస్టేషన్‌లో అగ్ని ప్రమాదం!

ABN , Publish Date - Nov 17 , 2026 | 06:42 AM

చర్లపల్లి రైల్వేస్టేషన్‌లో నిలిపివున్న ఓ బోగీలో మంటలు చెలరేగాయి. ఈ ఘటన సోమవారం సాయంత్రం 6.30 గంటల సమయంలో చోటు చేసుకుంది.

చర్లపల్లి రైల్వేస్టేషన్‌లో అగ్ని ప్రమాదం!
Cherlapally Train Fire

  • ప్లాట్‌ఫారం నెం.5-6 మధ్య రైలు బోగీ దగ్ధం

హైదరాబాద్‌ సిటీ/కుషాయిగూడ, నవంబరు 16 (ఆంధ్రజ్యోతి) : చర్లపల్లి రైల్వేస్టేషన్‌లో నిలిపివున్న ఓ బోగీలో మంటలు చెలరేగాయి. ఈ ఘటన సోమవారం సాయంత్రం 6.30 గంటల సమయంలో చోటు చేసుకుంది. ప్లాట్‌ఫాం నెంబరు 5-6 మధ్యలోని లూప్‌లైన్‌లో నిలిపివున్న అదనపు బోగీల్లో ఓ బోగీ నుంచిమంటలు చెలరేగాయి.


రైల్వే అగ్నిమాపక సిబ్బంది దాదాపు 50 నిమిషాలు కష్టపడి మంటల్ని అదుపులోకి తీసుకువచ్చారు. పెద్ద ప్రమాదాన్ని నివారించడంలో సఫలమయ్యారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని రైల్వే అధికారులు వెల్లడించారు. బోగీలో మంటలు ఎలా వచ్చాయనే కోణంలో దర్యాప్తు ప్రారంభించామని దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్‌వో శ్రీధర్‌ తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ప్రధాని మోదీతో సీఎం రేవంత్‌రెడ్డి భేటీ.. పలు కీలక అంశాలపై చర్చ

కాళేశ్వరం ప్రాజెక్టులో గేట్లు మూసి నీటిని నిల్వ చేసే అవకాశం లేదు: మంత్రి తుమ్మల

సజ్జనార్ ఆస్తుల కొనుగోళ్లపై విచారణ జరిపించాలి: రాజాసింగ్

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Nov 17 , 2026 | 06:42 AM