Share News

20 ఏళ్లయినా బీఆర్ఎస్ అధికారంలోకి రాదు: ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్

ABN , Publish Date - Sep 27 , 2026 | 03:39 PM

ఈరోజు (ఆదివారం) సీఎల్పీ మీడియా సెంటర్ వేదికగా ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్ బీఆర్ఎస్‌పై తీవ్రంగా మండిపడ్డారు. ఇరవై ఏళ్ల తరువాత కూడా ఆ పార్టీ అధికారంలోకి రాదంటూ ఫైరయ్యారు.

20 ఏళ్లయినా బీఆర్ఎస్ అధికారంలోకి రాదు: ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్
addanki dayakar

హైదరాబాద్, సెప్టెంబర్ 27: తెలంగాణ అస్తిత్వం అంటే అమరవీరులు మాత్రమేనని, కేసీఆర్ కాదని ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్ అన్నారు. ఈరోజు (ఆదివారం) సీఎల్పీ మీడియా సెంటర్ వేదికగా ఆయన బీఆర్ఎస్‌పై తీవ్రంగా మండిపడ్డారు. చావు నోట్లో కేసీఆర్ తలకాయ పెడితే తెలంగాణ వచ్చిందనేది అబద్ధమని చెప్పారు. సోనియా గాంధీ తెలంగాణ ఇవ్వకపోతే కేసీఆర్ ఎక్కడ తలకాయ పెట్టినా ఉపయోగం ఉండదని విమర్శించారు. తెలంగాణ అంటే తామే అన్న కల్వకుంట్ల కుటుంబాన్ని సీఎం రేవంత్ రెడ్డి పాతాళానికి తొక్కారన్నారు. అలాగే ఈ సెప్టెంబర్‌లోనే రేవంత్ అడుగు సిరిసిల్లలో పడబోతోందని తెలిపారు. బంధువులు, అనుచరులతో కేసీఆర్ నిర్మించుకుంటున్న సామ్రాజ్యాన్ని బద్దలు కొట్టడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు.


ఈ సందర్భంగా అద్దంకి దయాకర్ కేటీఆర్‌ను తీవ్రంగా విమర్శించారు. ఫ్యూచర్ సిటీని రద్దు చేస్తానని చెప్పి.. కేటీఆర్ తెలంగాణ ద్రోహిగా మారారని ధ్వజమెత్తారు. ‘కేటీఆర్ మమ్మల్ని బెదిరిస్తావా..? ముందు నీ భవిష్యత్తు చూసుకో. రెండేళ్లే కాదు ఇరవై ఏళ్ల తరువాత కూడా మీ పార్టీ అధికారంలోకి రాదు’అంటూ ఆయన ఫైరయ్యారు. బీఆర్ఎస్ నాయకులు అవినీతితో సంపాదించిన డబ్బుతో విష ప్రచారాలు చేస్తున్నారని ఆరోపించారు. గతంలో దళితుణ్ని సీఎం చేస్తానన్న కేసీఆర్.. గెలిచిన తరువాత ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. దళితులకు భూమి ఇవ్వకపోగా.. వారికి ఇందిరమ్మ ఇచ్చిన భూములను బీఆర్ఎస్ నేతలు లాక్కున్నారని మండిపడ్డారు.


అసైన్డ్ భూములు, ఇనాం భూములు, ప్రభుత్వ భూములు.. ఇలా వేటినీ వదలకుండా బీఆర్ఎస్ నాయకులు ఆక్రమించారని ఆయన ఆరోపించారు. అలాంటి కోట్ల రూపాయల విలువ చేసే భూములను హైడ్రా విముక్తి చేసిందని చెప్పారు. భూములను ఆక్రమించుకున్న తెలంగాణ ద్రోహులను కేసీఆర్ పక్కన పెట్టుకుని తిరుగుతున్నారని ఆయన విమర్శించారు.


ఈ వార్తలూ చదవండి

రాహుల్ ఆరోపణలను ప్రజలు అసహ్యించుకుంటున్నారు: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

భూ సమస్యల పరిష్కారమే ప్రధాన లక్ష్యం: మంత్రి పొంగులేటి

Updated Date - Sep 27 , 2026 | 03:40 PM