రాహుల్ ఆరోపణలను ప్రజలు అసహ్యించుకుంటున్నారు: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
ABN , Publish Date - Sep 27 , 2026 | 01:20 PM
ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌ను రాజీనామా చేయమనడం, రాజ్యాంగ సంస్థ అయిన ఎన్నికల సంఘం నిబద్ధతను ప్రశ్నించడాన్ని బట్టి చూస్తే రాహుల్ గాంధీ విచక్షణ కోల్పోయి మాట్లాడుతున్నట్లు అనిపిస్తోందని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అన్నారు.
హైదరాబాద్, సెప్టెంబర్ 27: ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌ను రాజీనామా చేయమనడం, రాజ్యాంగ సంస్థ అయిన ఎన్నికల సంఘం నిబద్ధతను ప్రశ్నించడాన్ని బట్టి చూస్తే రాహుల్ గాంధీ విచక్షణ కోల్పోయి మాట్లాడుతున్నట్లు అనిపిస్తోందని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అన్నారు.
రాహుల్ గాంధీని ప్రధానిని చేసేందుకు ఎన్నికల సంఘం పనిచేయదని గుర్తుంచుకోవాలన్నారు. ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిస్తే ఎన్నికల సంఘం సరిగా పనిచేస్తున్నట్లు.. కాంగ్రెస్ ఓటమిపాలైతే ఎన్నికల సంఘంలో అక్రమాలు జరుగుతున్నట్లా.. అని కిషన్‌రెడ్డి ప్రశ్నించారు.
బీజేపీని, ప్రజాస్వామ్యాన్ని, ఎన్నికల సంఘాన్ని విమర్శించే హక్కు కాంగ్రెస్ పార్టీకి లేదని కిషన్ రెడ్డి తీవ్రంగా ఆరోపించారు. కాంగ్రెస్, రాహుల్ చేస్తోన్న ఆరోపణలను ప్రజలు అసహ్యించుకుంటున్నారని కిషన్‌రెడ్డి అన్నారు. ఈసీ అంశంలో కాంగ్రెస్‌కు సహకరిస్తున్న మిత్రపక్షాల వ్యాఖ్యలను కిషన్ రెడ్డి ఖండించారు.
ఇవీ చదవండి:
తమిళ గ్రంథం తిరుక్కురళ్‌లో ఏముంది?
పాక్‌కు ఉగ్రవాదం అలవాటైంది: విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్