పాక్‌కు ఉగ్రవాదం అలవాటైంది: విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్
ABN , Publish Date - Sep 27 , 2026 | 08:10 AM
ఉగ్రవాదం పాకిస్థాన్‌కు అలవాటైందని విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్.జైశంకర్ అన్నారు. ఐక్యరాజ్యసమితి సాధారణ అసెంబ్లీ 81వ సమావేశంలో ఆయన మాట్లాడారు. వాస్తవాలను దాచి తప్పుడు లెక్కలు చూపెడుతోందని పాక్‌పై ఆయన మండిపడ్డారు.
ఇంటర్‌నెట్ డెస్క్: ఉగ్రవాదం పాకిస్థాన్‌కు అలవాటైందని విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్.జైశంకర్ అన్నారు. ఐక్యరాజ్యసమితి సాధారణ అసెంబ్లీ 81వ సమావేశంలో ఆయన మాట్లాడారు. వాస్తవాలను దాచి తప్పుడు లెక్కలు చూపెడుతోందని పాక్‌పై ఆయన మండిపడ్డారు. భారత్‌పై మరోసారి దాడికి పాల్పడితే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. ఉగ్రవాదంతో పాటు పాక్ దాడుల నుంచి దేశాన్ని రక్షించుకునే హక్కు భారత్‌కు ఉంటుందన్న విషయాన్ని పాకిస్తాన్ గుర్తుంచుకోవాలని ఆయన హితవుపలికారు. ఉగ్రవాదానికి పాక్ ముగింపు పలికితేనే చర్చల విషయంపై ఆలోచిస్తామని స్పష్టం చేశారు. టెర్రరిజంతో స్నేహం ఉండదని, రెండూ ఒకేచోట ఉండలేవన్నారు. పాకిస్తాన్ పెంచి పోషిస్తున్న ఉగ్రవాదమే శాంతికి ముప్పుగా వాటిల్లిందన్నారు. పాక్ తన తీరు మార్చుకోవాలని ఆయన హితవు పలికారు.
ప్రభుత్వాలదే బాధ్యత..
పాకిస్థాన్ భూభాగాన్ని ఉగ్రవాదులు వాడుకోకుండా చూసే బాధ్యత ఆ దేశ ప్రభుత్వానిదే అని జైశంకర్ అన్నారు. ఉగ్రవాద కార్యకలాపాల్లో ప్రభుత్వాలు పాలు పంచుకోరాదన్నారు. ఒక దేశ భూభాగాన్ని ఉగ్రవాదులు ఉపయోగిస్తే, దానికి ఆ దేశ ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. జీరో టెర్రరిజంపై భారత వైఖరి మారదని తేల్చిచెప్పారు. కాగా.. అంతకుముందు ఐరాసలో పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ మాట్లాడుతూ కశ్మీర్ అంశాన్ని ప్రస్తావించిన విషయం తెలిసిందే. దక్షిణాసియాలో 2025 తరహా ఘర్షణలు పునరావృతం కాకుండా ఉండాలంటే, కశ్మీర్ సమస్యకు న్యాయమైన, సముచితమైన పరిష్కారం అవసరమని ఆయన అన్నారు. దీనిపై స్పందించిన భారత్.. జమ్మూకశ్మీర్ భారత్‌లోనే అంతర్భాగమని స్పష్టం చేసింది. పీఓకేలో మానవ హక్కుల పరిస్థితిపై దృష్టి సారించాలని కోరింది. అక్కడి ప్రజలను అడిగితే పాక్ ప్రభుత్వ చర్యలు, మానవ హక్కుల ఉల్లంఘనల గురించి తెలుస్తాయని భారత ప్రతినిధి వ్యాఖ్యానించారు.
ఈ వార్తలు కూడా చదవండి
100 శాతం ఇథనాల్‌తో నడిచే కారు!
రేణిగుంట-అరక్కోణం మధ్య మరో రెండు లైన్లు
మరిన్ని నేషనల్, ఇంటర్నేషనల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..