రేణిగుంట-అరక్కోణం మధ్య మరో రెండు లైన్లు
ABN , Publish Date - Sep 27 , 2026 | 04:49 AM
ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లో రైళ్ల రాకపోకలను మరింత వేగవంతం చేసేందుకు రైల్వే బోర్డు రెండు భారీ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది.
రైల్వే బోర్డు అధికారిక ఆమోదం.. నిధులు కేటాయిస్తూ ఉత్తర్వులు
న్యూఢిల్లీ, సెప్టెంబరు 26 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లో రైళ్ల రాకపోకలను మరింత వేగవంతం చేసేందుకు రైల్వే బోర్డు రెండు భారీ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. దాదాపు రూ. 4,178 కోట్లతో ఏపీ, తమిళనాడు రాష్ట్రాల్లో చేపట్టే పనులకు అధికారికంగా నిధులు కేటాయిస్తూ రైల్వే బోర్డు శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. దీనిలో రేణిగుంట-అరక్కోణం మధ్య 77 కిలోమీటర్ల మేర 3, 4వ లైన్ల నిర్మాణానికి రూ. 1,936.46 కోట్లను మంజూరు చేశారు. అలాగే తమిళనాడులోని సేలం-కరూర్-దిండిగల్ మధ్య 159 కిలోమీటర్ల డబ్లింగ్ పనుల కోసం రూ.2,241.67 కోట్లు కేటాయించారు. ఇటీవల ఈ ప్రాజెక్టుల నిర్మాణానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. తాజాగా రైల్వే బోర్డు కూడా నిధులు కేటాయించింది. రేణిగుంట-అరక్కోణం ప్రాజెక్టుకు కేటాయించిన నిధుల్లో సివిల్ పనుల కోసం రూ. 1,580.33 కోట్లు, సిగ్నలింగ్, టెలికమ్యూనికేషన్స్ విభాగానికి రూ. 281.78 కోట్లు, విద్యుద్ధీకరణకు రూ. 379.56 కోట్లను కేటాయించినట్లు రైల్వే బోర్డు వెల్లడించింది.
ఈ వార్తలనూ చదవండి:
మత్స్యకార కుటుంబాలకు 50 కేజీల ఉచిత బియ్యం.. సీఎం చంద్రబాబు ఆదేశాలు