Share News

భూ సమస్యల పరిష్కారమే ప్రధాన లక్ష్యం: మంత్రి పొంగులేటి

ABN , Publish Date - Sep 27 , 2026 | 01:25 PM

దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న భూ సమస్యల పరిష్కారానికి తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ULC పెండింగ్‌ దరఖాస్తులను పరిశీలించి, అర్హత ఉన్న కేసులను నిబంధనల ప్రకారం క్రమబద్ధీకరించాలని ఆదేశించింది..

భూ సమస్యల పరిష్కారమే ప్రధాన లక్ష్యం: మంత్రి పొంగులేటి
ULC Land Issues

హైదరాబాద్‌, సెప్టెంబర్ 27: దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న భూ సమస్యల పరిష్కారానికి తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ULC పెండింగ్‌ దరఖాస్తులను పరిశీలించి అర్హత ఉన్న కేసులను నిబంధనల ప్రకారం క్రమబద్ధీకరించాలని ఆదేశించింది. ప్రజల భూ సమస్యల పరిష్కారమే ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న అర్బన్ ల్యాండ్ సీలింగ్‌ (ULC) దరఖాస్తుల పరిష్కారానికి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. GO 455, 456, 747, 92 కింద పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను పరిశీలించి.. అర్హత ఉన్న కేసులను నిబంధనల ప్రకారం క్రమబద్ధీకరించేందుకు చర్యలు చేపట్టాలని అధికారులు ఆదేశించారు. ఇందుకోసం Memo No.48062 జారీ చేసినట్లు మంత్రి తెలిపారు. 2016లోనే దీనికి సంబంధించిన GO జారీ చేసినప్పటికీ గత ప్రభుత్వం దానిని అమలు చేయలేదని పేర్కొన్నారు. ప్రస్తుతం పెండింగ్‌లో ఉన్న అర్హత కలిగిన ULC కేసులను పరిష్కరించే దిశగా ప్రభుత్వం చర్యలు ప్రారంభించిందని చెప్పారు.


ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అసెంబ్లీలో ఇచ్చిన హామీలకు అనుగుణంగా 22-A భూ సమస్యలను కూడా ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్నామని మంత్రి పొంగులేటి వెల్లడించారు. ఇప్పటికే GO 118, GO 76లకు అనుగుణంగా కీలక ఉత్తర్వులు జారీ చేశామని, 22-A జాబితాలో ఉన్నప్పటికీ అనుమతులు కలిగిన ఇళ్లు, ప్లాట్లు, ఫ్లాట్ల రిజిస్ట్రేషన్లకు అనుమతి కల్పించినట్లు తెలిపారు. తాజాగా ULC పెండింగ్ దరఖాస్తులపై స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడంతో భూ సమస్యల పరిష్కారానికి మరో ముందడుగు పడిందన్నారు. మిగిలిన 22-A సమస్యలను కూడా ఫాస్ట్‌ట్రాక్ విధానంలో పరిష్కరించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మంత్రి స్పష్టం చేశారు.


ఇవీ చదవండి:

బాంబర్లు దూసుకెళ్లిన వేళ.. ట్రంప్‌ ఉలిక్కిపాటు! జిన్‌పింగ్‌ కూల్‌గా.!

పెన్సిల్‌ మొనపై ‘చిన్న’ గణేశుడు.. కళాకారుడి అద్భుత సృష్టి!

Updated Date - Sep 27 , 2026 | 01:33 PM