Share News

పొత్తు పెట్టుకుంటే తప్పేంటి: ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి

ABN , Publish Date - Mar 25 , 2026 | 03:41 PM

బీఆర్ఎస్ ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకుంటే తప్పేమిటని బీఆర్ఎస్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి వ్యాఖ్యానించారు. అలాగే హైదరాబాద్‌లో ఓటింగ్ శాతం తగ్గిపోవడానికి కారణాలపై కూడా ఆయన తన అభిప్రాయాన్ని వెల్లడించారు.

పొత్తు పెట్టుకుంటే తప్పేంటి: ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి
BRS MLA Sudhir Reddy

హైదరాబాద్: బీఆర్ఎస్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మీడియాతో చిట్‌చాట్‌లో భాగంగా పలు రాజకీయ అంశాలపై తన అభిప్రాయాలను వెల్లడించారు. డీలిమిటేషన్ జరిగితే గ్రేటర్ హైదరాబాద్‌లో అసెంబ్లీ సీట్ల సంఖ్య పెరిగే అవకాశముందని ఆయన పేర్కొన్నారు.


టీడీపీ పార్టీ కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఏర్పడినప్పటికీ, ప్రస్తుతం అదే కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోవడం రాజకీయాల్లో సాధారణమైందని సుధీర్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకుంటే తప్పేమిటని ప్రశ్నించారు. అలాగే, సర్ (SIR- Special Intensive Revision) నిర్వహించడం మంచిదేనని ఆయన అభిప్రాయపడ్డారు. ఓటర్ల జాబితాను సమగ్రంగా నవీకరించడం అవసరమని చెప్పారు.


హైదరాబాద్ నగరంలో ఓటింగ్ శాతం తగ్గిపోవడంపై కూడా ఆయన స్పందించారు. ఐదేళ్ల పాటు నగరంలో నివసించే ఓటర్లు, ఓటింగ్ రోజు తమ స్వగ్రామాలకు వెళ్లడం వల్ల గ్రేటర్‌లో పోలింగ్ శాతం తగ్గుతోందని ఆయన తెలిపారు.


Also Read:

ఆ ఇళ్లను కొత్త వారికి ఇస్తాం: మంత్రి పొంగులేటి

తెలంగాణ అసెంబ్లీలో డబుల్ బెడ్ రూం ఇళ్లపై చర్చ.. ఎవరేమన్నారంటే..

For More Latest News

Updated Date - Mar 25 , 2026 | 03:41 PM