Share News

రామ్‌చరణ్‌కు గాయం.. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించిన డిప్యూటీ సీఎం పవన్..

ABN , Publish Date - Mar 25 , 2026 | 02:49 PM

రామ్‌చరణ్ కంటికి గాయం అవటంపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ స్పందించారు. రామ్‌చరణ్ త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు.

రామ్‌చరణ్‌కు గాయం.. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించిన డిప్యూటీ సీఎం పవన్..
Ram Charan injury

అమరావతి, మార్చి 25: గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్ ‘పెద్ది’ సినిమా షూటింగ్ సందర్భంగా గాయపడిన సంగతి తెలిసిందే. ఓ యాక్షన్ సీన్‌ను చిత్రీకరిస్తున్న సమయంలో చరణ్ కంటికి స్వల్ప గాయం అయింది. ఈ సంఘటనపై పెద్ది సినిమా టీం స్పందించింది. అది పెద్ద ప్రమాదం కాదని, చిన్నపాటి గాయం మాత్రమేనని వెల్లడించింది. వైద్యుల సూచన మేరకు రామ్‌చరణ్ రెండు రోజుల పాటు విశ్రాంతి తీసుకుంటున్నారని, ప్రస్తుతం ఆయన ఆరోగ్యం పూర్తిగా కుదుటగా ఉందని తెలిపింది. అతి త్వరలోనే చరణ్ సినిమా షూటింగ్‌లో పాల్గొనే అవకాశముందని పేర్కొంది.


గాయం నుంచి రామ్‌చరణ్ త్వరగా కోలుకోవాలి

రామ్‌చరణ్ కంటికి గాయం అవటంపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ స్పందించారు. ‘అగ్రశ్రేణి యువ కథానాయకుడు రామ్‌చరణ్ ‘పెద్ది’ సినిమా చిత్రీకరణ సమయంలో గాయపడ్డారని తెలిసింది. రామ్‌చరణ్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాను’ అని పవన్ పేర్కొన్నారు.


పెద్ది సినిమాపై భారీ అంచనాలు..

రామ్‌చరణ్‌, జాన్వీ కపూర్ జంటగా నటిస్తున్న ‘పెద్ది’ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఉప్పెన సినిమా దర్శకుడు బుచ్చిబాబు సాన ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా నుంచి వచ్చిన పాటలకు ప్రపంచ వ్యాప్తంగా మంచి స్పందన వచ్చింది. చికిరి చికిరి పాట సోషల్ మీడియా సెన్సేషన్‌గా నిలిచింది. దాదాపు 300 కోట్ల రూపాయల బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా ఏప్రిల్ నెలలో ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. మెగా ఫ్యాన్స్ ఈ సినిమాపైనే ఆశలు పెట్టుకున్నారు. ఈ సినిమా ఇండస్ట్రీ రికార్డులు తిరగరాయాలని భావిస్తున్నారు.


ఇవి కూడా చదవండి

మీ బ్రెయిన్ షార్ప్ అయితే.. ఈ ఫొటోలో మొత్తం ఎన్ని సింహాలున్నాయో 12 సెకెన్లలో కనిపెట్టండి..

ఢిల్లీ అసెంబ్లీకి బాంబు బెదిరింపు.. 24 గంటల్లో ఇది రెండోసారి

Updated Date - Mar 25 , 2026 | 03:44 PM