Share News

ఢిల్లీ అసెంబ్లీకి బాంబు బెదిరింపు.. 24 గంటల్లో ఇది రెండోసారి

ABN , Publish Date - Mar 25 , 2026 | 02:39 PM

ఢిల్లీ అసెంబ్లీకి బుధవారంనాడు బాంబు బెదిరింపు రావడం కలకలం రేపింది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల వేళ బాంబు బెదిరింపులు రావడం గత 24 గంటల్లో ఇది రెండోసారి.

ఢిల్లీ అసెంబ్లీకి బాంబు బెదిరింపు.. 24 గంటల్లో ఇది రెండోసారి
Delhi Assembly

న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీకి బుధవారంనాడు బాంబు బెదిరింపు రావడం కలకలం రేపింది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల వేళ బాంబు బెదిరింపులు రావడం గత 24 గంటల్లో ఇది రెండోసారి. ముఖ్యమంత్రి రేఖాగుప్తా మంగళవారంనాడు బడ్జెట్ సమర్పణకు కొన్ని గంటలకు ముందు బాంబు బెదిరింపు వచ్చింది. తొలుత అసెంబ్లీకి, ఆ తర్వాత స్పీకర్ విజేందర్ గుప్తాకు బెదిరింపు ఈమెయిల్స్ వచ్చాయి. వెంటనే చేపట్టిన తనిఖీల్లో ఆ బెదిరింపులు ఉత్తవేనని తేలాయి. దీంతో సీఎం బడ్జెట్ సమర్పణ ఆలస్యంగా జరిగింది.


తాజాగా అసెంబ్లీ ఆవరణలో బాంబులు పెట్టామంటూ స్పీకర్‌ అధికారిక ఈమెయిల్ ఐడీకి సమాచారం వచ్చినట్టు అధికారులు బుధవారంనాడు తెలిపారు. దీంతో సెక్యూరిటీ ఏజెన్సీలు అసెంబ్లీ ఆవరణలో తనిఖీలు నిర్వహించాయి. బాంబు డిస్పోజల్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్, స్థానిక పోలీసు బృందాలు క్షుణ్ణంగా పరిశీలించి బాంబులు కానీ, ఎలాంటి పేలుడు పదార్ధాలు కానీ లేవని నిర్ధారించాయి. బెదిరింపు కాల్స్‌‌ను తాము సీరియస్‌గా తీసుకుంటున్నామని, తనిఖీలు, నిఘా పెంపు వంటి చర్యలు తీసుకుంటున్నామని పోలీసు సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఈమెయిల్స్ ఎక్కడి నుంచి వచ్చాయని తెలుసుకునేందుకు సైబర్ నిపుణులు, సెక్యూరిటీ ఏజెన్సీలు విచారణ చేపట్టాయి. ఐపీ ట్రాకింగ్, ఈమెయిల్ హెడర్ అనాలసిస్ నిర్వహిస్తున్నాయి.


ఇవి కూడా చదవండి..

కాంగ్రెస్ పార్టీకి షాక్.. ప్రధాన కార్యాలయం ఖాళీ చేయాలంటూ నోటీసు

సోనియా గాంధీకి అస్వస్థత.. ఆసుపత్రిలో చేరిక

Updated Date - Mar 25 , 2026 | 02:40 PM