కాంగ్రెస్ ఉద్దేశపూర్వకంగానే అసత్యాలు ప్రచారం చేస్తోంది: మాజీ మంత్రి హరీశ్ రావు
ABN , Publish Date - Sep 18 , 2026 | 08:53 PM
ఫాంహౌజ్ చుట్టూ సుడా పేరిట భూకబ్జా చేశారన్న ఆరోపణలపై బీఆర్ఎస్ నేత తీవ్రంగా స్పందించారు. ఆయనపై బురదజల్లే ఉద్దేశంతోనే కాంగ్రెస్ అబద్దాలు ప్రచారం చేస్తోందని ఆయన ఆరోపించారు.
హైదరాబాద్, సెప్టెంబర్ 18: ఫాంహౌజ్ చుట్టూ సుడా పేరిట భూకబ్జా చేశారన్న ఆరోపణలపై బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్రంగా స్పందించారు.
‘ఎలక్షన్ సమయంలో అఫిడవిట్‌లో నా వివరాలన్నీ పెట్టాను. 2018లో మొదట ఒక ఎకరం కొన్నాను. 2024 వరకు మొత్తం13 ఎకరాలు కొనుగోలు చేశాను. కాంగ్రెస్ ప్రభుత్వమే నాకు హద్దులు చూపించి క్లియరెన్స్ ఇచ్చింది. అక్కడ వ్యవసాయం తప్పితే ఏమీ లేదు. కావాలంటే మీడియా వాళ్లందరికీ అక్కడే భోజనాలు ఏర్పాట్లు చేసి.. అదంతా చూపిస్తా.. వాళ్లే రాష్ట్ర ప్రజలకు చెప్పాలి’ అని హరీశ్ రావు పేర్కొన్నారు.
‘హరీశ్ రావు బెదిరిస్తే ప్రజలు ఊరుకుంటారా.. వాళ్ల భూములను ఇచ్చేస్తారా.. పాత రోడ్డు ప్లేసులోనే కొత్త రోడ్డు వేశారు కానీ.. నాకోసం ప్రత్యేకంగా ఎక్కడా రోడ్డు వేయలేదు. ఆ రోడ్లను కూడా ఇరిగేషన్ డిపార్ట్‌మెంట్ వాళ్లు వేశారు కానీ.. సుడా వేయలేదు.. మియా వాకి ప్లాంటేషన్ కోసమే అక్కడ చెట్లు పెట్టాము కానీ.. అది పార్కు కాదు. అది రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ప్లాంటేషన్. ఒక సిద్దిపేటలోనే చెట్లు పెట్టలేదు.. ఎందుకు నా మీద అసత్య ప్రచారాల చేస్తున్నారు. నా మీద బురద జల్లే కార్యక్రమానికి కాంగ్రెస్ పూనుకుంది’ అని హరీశ్ ఆరోపించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
దానంకు పట్టిన గతే.. మిగతా ఎనిమిది మందికీ పడుతుంది: ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి
ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై అనర్హత వేటు.. స్వాగతించిన బీజేపీ నేతలు
For More TG News And Telugu News