Share News

దానంకు పట్టిన గతే.. మిగతా ఎనిమిది మందికీ పడుతుంది: ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి

ABN , Publish Date - Sep 18 , 2026 | 05:23 PM

ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఫైటర్ కాదు చీటర్ అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అభివర్ణించారు. దానం నాగేందర్‌కు పట్టిన గతే పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన మిగతా ఎనిమిది మందికీ పడుతుందని స్పష్టం చేశారు.

దానంకు పట్టిన గతే.. మిగతా ఎనిమిది మందికీ పడుతుంది: ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి
BRS MLA Padi Kaushik Reddy

హైదరాబాద్, సెప్టెంబర్18: ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఫైటర్ కాదు చీటర్ అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అభివర్ణించారు. దానం నాగేందర్‌కు పట్టిన గతే పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన మిగతా ఎనిమిది మందికీ పడుతుందని స్పష్టం చేశారు. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై తెలంగాణ హైకోర్టు అనర్హత వేటు వేయడం ప్రజాస్వామ్యం సాధించిన విజయమని ఆయన అభివర్ణించారు. హైకోర్టు తీర్పుపై శుక్రవారం తెలంగాణ భవన్‌లో ఆయన స్పందించారు. ఈ తీర్పు సీఎం రేవంత్ రెడ్డికి చెంపపెట్టు అని అన్నారు. హైకోర్టుకు బీఆర్ఎస్ పార్టీ తరఫున ధన్యవాదాలు తెలిపారు.


ఇది బీఆర్ఎస్ విజయమని గుర్తు చేశారు. ఈ రెండున్నరేళ్లుగా పోరాటం చేస్తున్న తమ పార్టీకి దక్కిన విజయమని పేర్కొన్నారు. ప్రజలను ఎల్లకాలం మోసం చేయవచ్చని సీఎం రేవంత్ అనుకున్నారని చెప్పారు. కానీ ఆయనకు హైకోర్టు బ్రేక్ వేసిందని తెలిపారు. దానం నాగేందర్ లాగే పార్టీ మారిన మిగతా ఎనిమిది మందిపై కూడా అనర్హత వేటు పడటం ఖాయమని ఈ సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి జోస్యం చెప్పారు.


త్వరలో జరగనున్న ఖైరతాబాద్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధించడం ఖాయమని స్పష్టం చేశారు. ఏ పార్టీయో చెప్పుకోలేని పరిస్థితితో ఉన్నారంటూ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు చురకలంటించారు. మిగతా ఎనిమిది నియోజకవర్గాల్లో కూడా ఉప ఎన్నికలు వస్తాయని పేర్కొన్నారు. పార్టీ మారిన కడియం శ్రీహరిది అనైతికమా? నాది అనైతికమా? అనేది ఎథిక్స్ కమిటీ తేల్చాలని డిమాండ్ చేశారు. సీఎం రేవంత్ మోసాలకు ఖైరతాబాద్ ఓటర్లు తీర్పునిస్తారని పాడి కౌశిక్ రెడ్డి అన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

దానం నాగేందర్‌పై అనర్హత వేటు.. కేటీఆర్ రియాక్షన్

ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై అనర్హత వేటు.. స్వాగతించిన బీజేపీ నేతలు

For More TG News And Telugu News

Updated Date - Sep 18 , 2026 | 05:58 PM