Share News

మహేశ్‌, పొంగులేటికి బీఆర్‌ఎస్‌ లీగల్‌ నోటీస్‌

ABN , Publish Date - Oct 20 , 2026 | 05:08 AM

మాజీ సీఎం కేసీఆర్‌ తన ఫాంహౌ్‌సకు కొండపోచమ్మ సాగర్‌ నీటిని మళ్లించుకున్నారంటూ తప్పుడు ప్రచారం చేస్తున్న కాంగ్రెస్‌ నేతలకు లీగల్‌ నోటీసులు పంపినట్లు బీఆర్‌ఎస్‌ పార్టీ లీగల్‌ సెల్‌ తెలిపింది.

మహేశ్‌, పొంగులేటికి బీఆర్‌ఎస్‌ లీగల్‌ నోటీస్‌
Mahesh Goud, , Ponguleti Srinivasa Reddy

  • కేసీఆర్‌పై తప్పుడు పోస్టులు తొలగించాలని డిమాండ్‌

హైదరాబాద్‌, అక్టోబరు 19 (ఆంధ్రజ్యోతి): మాజీ సీఎం కేసీఆర్‌ తన ఫాంహౌ్‌సకు కొండపోచమ్మ సాగర్‌ నీటిని మళ్లించుకున్నారంటూ తప్పుడు ప్రచారం చేస్తున్న కాంగ్రెస్‌ నేతలకు లీగల్‌ నోటీసులు పంపినట్లు బీఆర్‌ఎస్‌ పార్టీ లీగల్‌ సెల్‌ తెలిపింది. కేసీఆర్‌ ప్రతిష్ఠను దెబ్బతీసేలా దుష్ప్రచారం చేస్తున్న టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌గౌడ్‌, మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి, ఎంపీ గడ్డం వంశీకృష్ణకు లీగల్‌ నోటీసులు పంపినట్లు సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వారు తమ సోషల్‌ మీడియా ఖాతాల్లో పెట్టిన పోస్టులను తక్షణమే బేషరతుగా తొలగించాలని డిమాండ్‌ చేశారు. ఈ నోటీసులకు స్పందించకుంటే.. పరువు నష్టం దావా వేసి న్యాయపరమైన చర్యలు చేపడతామని బీఆర్‌ఎస్‌ లీగల్‌ సెల్‌ హెచ్చరించింది.


ఈ వార్తలు కూడా చదవండి

మద్యం విక్రయాల జోరు.. దసరా నేపథ్యంలో ఫుల్‌ జోష్‌

ఏసీబీకి కొత్త జవసత్వాలు

డిజిటల్‌ వేదికపై తాండూరు కందిపప్పు రైతులు

Read Latest AP News And Telangana News And International

Updated Date - Oct 20 , 2026 | 05:08 AM