Share News

హైదరాబాద్‌లో బోనాల సందడి.. జులై 16 నుంచి ప్రారంభం

ABN , Publish Date - Jul 10 , 2026 | 03:56 PM

భాగ్యనగరంలో బోనాల ఉత్సవాల సందడి మొదలు కానుంది. ఈనెల 16 నుంచి హైదరాబాద్‌ ఆషాఢ బోనాల ఉత్సవాలు ప్రారంభంకానున్నట్లు మంత్రి కొండా సురేఖ వెల్లడించారు.

హైదరాబాద్‌లో బోనాల సందడి.. జులై 16 నుంచి ప్రారంభం
Hyderabad Bonalu 2026

హైదరాబాద్, జులై 10: భాగ్యనగరంలో బోనాల ఉత్సవాల సందడి మొదలు కానుంది. ఈనెల 16 నుంచి హైదరాబాద్‌ ఆషాఢ బోనాల ఉత్సవాలు ప్రారంభంకానున్నాయి. గోల్కొండ జగదాంబిక మహంకాళి అమ్మవారికి తొలి బోనాన్ని సమర్పించనున్నారు. ఈరోజు(శుక్రవారం) ఆషాఢ బోనాల జాతర పోస్టర్, బ్రోచర్‌ను మంత్రి కొండా సురేఖ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. బోనాలు తెలంగాణ గంగా-జమున తెహజీబ్‌కు ప్రతీక అని అన్నారు. హిందూ - ముస్లిం ఐక్యత దేశానికి ఆదర్శమని చెప్పుకొచ్చారు. గోల్కొండ బోనాలు తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అని తెలిపారు. జులై 16 నుంచి ఆగస్టు 13 వరకు బోనాల ఉత్సవాలు జరగనున్నాయని వెల్లడించారు.


లక్షలాది మంది భక్తుల కోసం పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అధికారులకు మంత్రి ఆదేశించారు. ట్రాఫిక్, పార్కింగ్, క్యూ లైన్లు, తాగునీరు, వైద్య సేవలపై ప్రత్యేకంగా దృష్టిసారించాలన్నారు. పరిశుభ్రత, విద్యుత్, భద్రతలో రాజీ వద్దని ఆదేశాలు జారీ చేశారు. శివసత్తులకు బోనాల సమర్పణలో అన్ని శాఖలు సహకరించాలన్నారు. పోలీస్ కంట్రోల్ రూంతో భక్తుల భద్రతకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. చిన్నారులు, వృద్ధులు, గర్భిణులు, బాలింతలకు ప్రత్యేక సౌకర్యాలు కల్పించాలని తెలిపారు. భక్తులు సంతృప్తిగా దర్శనం చేసుకునేలా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని అధికారులకు మంత్రి కొండా సురేఖ సూచించారు.


ఇవి కూడా చదవండి...

ఆయిల్ పామ్ సాగు వైపు మొగ్గు చూపండి.. రైతులకు మంత్రి పొన్నం విజ్ఞప్తి

హరీశ్ కాంగ్రెస్‌లోకి వస్తానంటే చర్చిస్తాం: మహేశ్ కుమార్

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jul 10 , 2026 | 04:42 PM