హరీశ్ కాంగ్రెస్‌లోకి వస్తానంటే చర్చిస్తాం: మహేశ్ కుమార్
ABN , Publish Date - Jul 10 , 2026 | 02:23 PM
మూడు నెలలు నీటిపారుదల మంత్రిగా అవకాశం ఇస్తే నీటి సమస్యను పరిష్కరించి చూపిస్తానంటూ బీఆర్‌ఎస్ మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు చేసిన వ్యాఖ్యలపై టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ స్పందించారు. హరీశ్ రావు నిజంగా కాంగ్రెస్‌లోకి వస్తానంటే పార్టీలో చర్చిస్తామన్నారు.
హైదరాబాద్, జులై 10: మూడు నెలలు నీటిపారుదల మంత్రిగా అవకాశం ఇస్తే నీటి సమస్యను పరిష్కరించి చూపిస్తానంటూ బీఆర్‌ఎస్ మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు చేసిన వ్యాఖ్యలపై టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ స్పందించారు. ఈరోజు(శుక్రవారం) మీడియాతో మాట్లాడుతూ.. హరీశ్ రావు నిజంగా కాంగ్రెస్‌లోకి వస్తానంటే పార్టీలో చర్చిస్తామన్నారు. పొలిటికల్ ఎఫైర్స్ కమిటీలో చర్చించి హరీశ్‌ను చేర్చుకోవాలా? వద్దా? అని నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. పదేండ్లు ఏం చేయని వారు మూడు నెలల సమయంలో ఏం చేస్తారని అన్నారు. గత ప్రభుత్వ అప్పులు, తప్పులను సరి చేస్తున్నామని మహేశ్ కుమార్ గౌడ్ వెల్లడించారు.
కాంగ్రెస్ పార్టీలో అంతర్గత గొడవలపై..
కాంగ్రెస్ పార్టీలో అంతర్గత గొడవలపై మహేశ్ స్పందిస్తూ.. కాంగ్రెస్ పార్టీలో భిన్నాభిప్రాయాలు సహజమన్నారు. మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యే కడియం శ్రీహరి సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు. తుంగతుర్తి సమస్య కూడా పరిష్కారం అవుతుందని చెప్పారు. ఇరు వర్గాల వాదనలు వింటామన్నారు. పార్టీలో అందరూ సమానమే అని తేల్చిచెప్పారు. క్రమశిక్షణ కమిటీ చైర్మన్ బిజీగా ఉండడం వల్ల ఇద్దరు సీనియర్ నాయకులను సమస్య పరిష్కారం కోసం నియమించామని అన్నారు. సస్పెండ్ చేయడమే పరిష్కారం కాదన్నారు. ప్రభుత్వాన్ని కూలగొడతామని అన్నప్పుడు.. పది మంది ఎమ్మెల్యేలు తమకు మద్దతు ఇచ్చారని చెప్పారు. నీళ్ల దోపిడీ జరిగినప్పుడు ఈటల మంత్రిగా ఉన్నారని మహేశ్ గుర్తుచేశారు.
ఇవి కూడా చదవండి...
నేడు ఒకరు ఆడించినట్టు ఆడే వ్యక్తిని కాదు: ఎంపీ ఈటల
ఆయిల్ పామ్ సాగు వైపు మొగ్గు చూపండి.. రైతులకు మంత్రి పొన్నం విజ్ఞప్తి
Read Latest Telangana News And Telugu News