మరింత ఉత్సాహంతో పనిచేద్దాం..
ABN , Publish Date - Nov 23 , 2026 | 03:22 AM
రాష్ట్రంలోని కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలంతా కలిసికట్టుగా పనిచేయడం వల్లే గత ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి రాగలిగామని ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ బీఎం సందీప్‌కుమార్ అన్నారు.
కాంగ్రెస్‌ను భారీ మెజారిటీతో గెలిపిద్దాం
రాష్ట్రంలో పార్టీ పనితీరు దేశానికే స్ఫూర్తిదాయకం: బీఎం సందీప్
పీఏసీలో క్రమశిక్షణపై చర్చకు నిరాకరించిన పార్టీ రాష్ట్ర ఇన్‌చార్జ్
నేడు మంత్రులు, డీసీసీ అధ్యక్షులతో వ్యక్తిగత సమావేశాలు
హైదరాబాద్, నవంబరు 22 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలంతా కలిసికట్టుగా పనిచేయడం వల్లే గత ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి రాగలిగామని ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ బీఎం సందీప్‌కుమార్ అన్నారు. ఆ తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లోనూ గెలిచామని చెప్పారు. ఇప్పుడు మనం మరింత ఉత్సాహంతో పనిచేసి వచ్చే ఎన్నికల్లో మరిన్ని అధిక స్థానాలు సంపాదించాలని వ్యాఖ్యానించారు. టీపీసీసీ విస్తృత కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పనితీరు దేశానికే స్ఫూర్తిదాయకంగా ఉందని కితాబిచ్చారు. దేశంలో ఎల్‌నినో వల్ల తీవ్ర కరువు ఏర్పడిందని, అయితే ఇక్కడ ఆ పరిస్థితులు అధిగమిస్తూ అభివృద్ధి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామన్నారు. కేంద్రంలోని బీజేపీ సర్కారు రాష్ట్రానికి తగినంత సహాయ సహకారాలు అందించకున్నా కరువును ఎదుర్కొంటూ అన్ని రకాలుగా ప్రజల అవసరాలు తీరుస్తున్నామని చెప్పారు. రాబోయే ఎన్నికల్లో రాహుల్ గాంధీని ప్రధానిగా చేసేందుకు మనమంతా కలిసికట్టుగా కష్టపడి పనిచేయాలన్నారు.
టీపీసీసీ చీఫ్ మహేశ్‌గౌడ్ మాట్లాడుతూ రాజకీయ ప్రస్థానంలో అనేక కీలక పదవులు చేపట్టిన సందీ్‌పకు.. ఎంబీ పాటిల్, రమేశ్ చెన్నితల ఆధ్వర్యంలో పనిచేసిన అనుభవముందని చెప్పారు. ఎల్‌నినో ప్రభావంతో తీవ్ర కరువు వచ్చే అవకాశం ఉందంటూ సీఎం రేవంత్ నిత్యం అప్రమత్తం చేశారని.. ఈ విషయంలో కేంద్రం నుంచి ఎలాంటి సహకారం లేదన్నారు. ఇక టీపీసీసీ రాజకీయ వ్యవహారాలు, సలహా కమిటీల సంయుక్త సమావేశంలో పార్టీ క్రమశిక్షణకు సంబంధించి ఒకరిద్దరు నాయకులు ప్రస్తావించగా.. దానిపై చర్చకు బీఎం సందీప్ అనుమతించలేదు. రాములునాయక్‌తో పాటుగా ఒకరిద్దరు నేతలు.. రాజగోపాల్‌రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యల వ్యవహారాన్ని ప్రస్తావించారు. అయుతే దీనిపై బీఎం సందీప్ స్పందిస్తూ ప్రస్తుతం అజెండా అంశాలకే పరిమితమవుదామని స్పష్టం చేశారు. ఏమైనా సమస్యలుంటే సందీ్‌పను వ్యక్తిగతంగా కలిసి చెప్పాలని సీఎం ఈ సందర్భంగా సూచించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేని నేపథ్యంలో చేసిన అభివృద్ధి పనులకు నిధులు సరిపోవట్లేదని, సంక్రాంతి తర్వాత చేపట్టనున్న కార్యక్రమానికి రూ.వేల కోట్ల నిధులు ఎలా సమకూరుతాయని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తూర్పు జగ్గారెడ్డి ప్రశ్నించారు. అయితే నిధుల కొరత రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు సీఎం సమాధానమిచ్చారు.
ఉత్తమన్నకు దత్తత పోతా!
మహేశ్‌గౌడ్ సరదా వ్యాఖ్యలు
కార్యవర్గ సమావేశంలో మహేశ్‌గౌడ్ వ్యాఖ్య లు.. నవ్వులు విరబూయించాయి. కాంగ్రెస్ కుటుంబ పార్టీ కాదన్న మహేశ్ గౌడ్.. తనకు, రేవంత్‌రెడ్డికి రాజకీయ వారసులు లేరంటూ వ్యాఖ్యానించారు. అలాగే మంత్రి ఉత్తమ్‌కు వారసులు లేరన్నారు. ఉత్తమ్.. తనను దత్తత తీసుకుంటే పోతానంటూ చమత్కరించారు. దానికి ఉత్తమ్ స్పందిస్తూ.. తాను చేసిన అప్పులకు దత్తత రావాల్సి ఉంటుందన్నారు. ఈ సందర్భంగా రోహిన్‌రెడ్డి, సంపత్ కూడా అదే పనిలో ఉన్నారంటూ రేవంత్ వ్యాఖ్యానించడంతో సమావేశంలో నవ్వులు విరిశాయి. కాగా, బీఎం సందీప్ సోమవారం మంత్రులు, డీసీసీ అధక్షులతో వ్యక్తిగత భేటీలు నిర్వహించనున్నారు. గాంధీభవన్‌లో జరిగే భేటీల్లో వారి సమస్యలను, పార్టీ పరిస్థితి గురించి అడిగి తెలుసుకోనున్నారు. 26న ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలతో ఆయన ముఖాముఖి భేటీ కానున్నారు.
ఈ వార్తలూ చదవండి
పార్టీకి నష్టపరిచేలా మాట్లాడితే చర్యలు.. సీఎం స్ట్రాంగ్ వార్నింగ్
పది లక్షల పుస్తకాల సేకరణే లక్ష్యం!